పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Pardhasaradhi Vutukuru కవిత

ఆకాశం లో సగం అన్నది నీకు బయట వ్యాపిస్తే ఆవేదనలలో అత్యున్నతం అన్నది నిజ స్తితి అతివ ఒక సౌందర్య రాశి అంతవరకే నేటి రోజులలో పురుషులతో సమానం గా కష్టపడినా కుటుంబ బాధ్యతలు సరిసమానం గా చూస్తున్నా స్వతంత్ర భావాలు లేని అందమైన మరబొమ్మ వివాహం విషయం స్వతంత్రత లేదు కుటుంబం నుంచి వెలివేత భావం ఎప్పుడు మారతాయో ఈ మూర్ఖపు భావాలు తల్లి తండ్రుల కోసం తెలియని వ్యక్తీ చేసుకుని నిరంతరం చస్తూ బ్రతుకుతూ వున్నా జీవితం అన్నాక ఆ మాత్రం తప్పదు అనే వేదాంతం ఒకటి మగవాడి భావాలు ఇలాంటివి అయినా సమాజం హర్షిస్తుంది మగువ మానసిక భావాల మీద ప్రతి ఒక్కడికి అధికారమే కదా అన్నీ వున్నా వాళ్లకు మనో వేదన తోడూ వుంటే తోడూ లేని వాళ్ళ మనోవేదనకు అవధి లేదు సంద్రం లో ప్రయాణిస్తూ త్రాగు నీరు లేని చందం చుట్టూ ఎంత మంది వున్నా మనసు తెలుసు కునే వ్యక్తీ లేని బాధ సహజంగా ఎదిగామో లేదో తెలియదు కాదు గానీ సాంకేతికంగా ఎదిగాం ... సున్నితం గా పరిశీలిద్దాం !!పార్ధ !!08march 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NHHkmP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి