పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//107 DSNR to SEC// కాకా నాల్గు దినాలైంది కనిపిస్తలేవ్? సుస్తీసేసుండె దావఖన బోయిన టికెట్ టికెట్ ముషీరాబాదా అన్నా పదమూడు రూపాయలు మూడు రూపాయలు చిల్లరియ్యన్నా... టికెట్ తీసుకుని కిటికీలోంచి చూస్తున్నా కొండను తవ్వి కట్టిన బవంతులు సిగ్నల్ దగ్గర పెరిగిన బిచ్చగాళ్ళు ఎన్ని చెరువులుండేవి ఈ పట్నంలో ఇప్పుడన్ని షాపులముందూ వాటరు బాటిల్సే మొలలో చిన్న గుడ్డ సంచి నోట్లో ఆకు వక్కతొ పండిన ఆ అవ్వ చటాకో అర్దపావో కూరలమ్ముతూ కంటబడుతుందనుకుంటే నిరాశే ఆవహించిది ఆ పుటెపాత్ మీద ఆమేనా ఆ ముసలి లంబాడీ చిన్నప్పుడు బాలానగర్ రింగులో ఎడ్లబండి మీద సీతాఫలాలు అమ్మిన ఆమేనా సంఘటిత సంచార జాతులూ ఒంటరివాళ్ళయ్యరే ఆ పట్నం ఆ లష్కరూ మారిపోయిందే... ఆలోచనలకి సడన్ బ్రేక్ పడ్డ బస్సు అందరినీ అటో ఇటో విసిరేసింది ఒక చేత్తో తోలు డబ్బు సంచి ఒకచేత్తో టికెట్లు తూలుకుంటా పోయి డ్రైవరు దగ్గర ఆగాడు కండక్టర్ ఇంద అని సాయి బాబా గుడికి పోయొస్తున్న బిడ్డ సంగం అరటి పండు కండక్టరుకి ఇచ్చి ఇంకో పండు డ్రైవరు ఇవ్వమని ఇస్తే డ్రైవర్ ఆలీ సాబ్ నాకు సగమే నీకు మొత్తం పండు దానే దానేమే కానేవాలేకా నామ్మ్ అరటిపండు అరటిపండుమే కానేవాలేకా నామ్మ్ అంటూ కండక్టర్ నువ్వు నీ బిడ్డలు సల్లగుండాలె అక్కా చిలుకూరి బాలజీ జై అనగానే బస్సంతా అమ్మల అక్కల జ్ణాపకాలే నేనూ అరటిపండు అడిగి తిన్నాను దిగుతూ కండక్టరుతో హైదరబాదు మారలేదు అన్నంతలోనే రైట్ రైటంటూ బస్సు ముందుకు సాగిపోయింది....10.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nf9Wnl

Posted by Katta

Narendra Babu కవిత

నాకు నమ్మకమివ్వు -------------------- నాకు కాస్త నమ్మకాన్ని ఇవ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను గడ్డిపోచ మొలకెత్తని చోటా సొగసరి సిరిమల్లెల సాగు చేస్తా సువాసనల పరిమళాలు గుబాళింపజేస్తా ప్లీజ్ నాకు కాస్త నమ్మకమివ్వు అనంత బండరాళ్ల గుట్టల సందుల్లో సెలయేటి పరవళ్లను తీసుకువస్తా పల్లమెరుగని ఎగుడుదిగుడు నేలల్లో నవనవలాడే జొన్న, కంది పంటలే కాదు మేలైన వరిసాగు కలసాకారం చేస్తా నాకు నమ్మకమివ్వు మన వారసుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తా అనంత అంటే ఫ్యాక్షనేనా మన మమకారాల మాధుర్యం పండగల కోలాహలం.. ఇవన్నీ ఏమయ్యాయి నాపై విశ్వాసముంచు ప్రపంచ యవ్వనికపై అనంతను అగ్రగామిగా నిలబెడతా ఇన్ని మాటలు ఎందుకుగానీ అనంత అభివృద్దిలో నేనూ ఓ రేణువు నవుతా మరి మీరు? _నరేంద్రబాబు, 11-03-14

by Narendra Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8Kcl8

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నా కిటికీ వద్దకు రా || ఒక్కసారి నా కిటికీ వద్దకు రా ******* నన్ను మొత్తం పోగేసుకొని ఈ చిన్న ద్వారం గుండా పిలుస్తుంది నేనే బరువెక్కిన నా కనురెప్పలను నీ ఒడిలో పిండి కొంత వెలుగు నింపుకుంటాను వెలేసిన లోకం నా బట్టలూడదీసింది నిండుగా నిన్ను కప్పుకొని మరలా పోరాడతాను ******* కిటికీ ఇప్పుడు నాకు జన్మనిచ్చింది దీని నుండే నీకోసం పసిపాపలా మరలా పుట్టాను నాకోసం సమాధి నుండి బ్రతికి కిటికీ ప్రక్కనే నువ్వు ఎదురుచూస్తున్నావని నాకు తెలుసు నువ్వు బ్రతికి నన్ను బ్రతికించడమే ప్రేమని ఇక ఇద్దరమూ కలిసి ఇక్కడి నుండి ప్రకటిద్దాం మీ చాంద్ || 11.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8Kete

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cLJFc2

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

---- చిరాశ // 33. రావోయ్ ఓ విద్యార్థి ర౦గుల కల కాదోయ్ ఇది // ********************************************* నీతిలేక, భీతిమరిచి జాతికెసరు పెట్టుదురా?!... సిగ్గులేక, నిగ్గుదేలి భవిత బుగ్గి సేయుదురా?!... కన్నవారి కలలన్నీ కళ్లలుగ మార్చొద్దోయ్ రావోయ్ ఓ విద్యార్థి ర౦గుల కల కాదోయ్ ఇది కోరుకున్న విద్యనేర్చి కొత్తపు౦త తొక్కవోయ్ మేథకె౦తొ పదునుపెట్టి మేధావిగ మారవోయ్ నీలో ఒదిగు౦దోయ్ విజ్ఙతె౦తొ నివురుగప్పు నిప్పువోలె మొక్కవోని స్థైర్య౦తో మొత్తమ౦త తెలుసుకో నిరీక్షణలు నీకొద్దోయ్, పరీక్షలకు సిద్దమవ్వు భవిష్యత్తు నీదేనోయ్ బాధ్యతెరిగి మసలుకో నీదీ ఒకరోజు౦దోయ్ నీకై అది వేచు౦దోయ్ దారితెన్నూ లేనోళ్లకు దిక్సూచివి నువు కావాలోయ్ *********************************************** ---- {11/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g3voC7

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి పుష్పవిలాపం ఆ వస్త్రమంటే తనకి చాలా ఇష్టం ఆ పరిమళమంటే తనకి మరింత ఇష్టం ఆ వస్త్రం చినిగిపోయినా ఆ పరిమళం ఆవిరై పోయినా అదే వస్త్రాన్ని కప్పుకుంటుంది అదే పరిమళంతో ఆకట్టుకుంటుంది తనదొక దివ్యమైన మనసు ఆ ప్రాంగణమంటే తనకి చాలా ఇష్టం ఆ నివాసమంటే తనకి మరింత ఇష్టం ప్రాంగణాలు మారినా నివాసాలు మారినా అదే జీవితం కొనసాగిస్తుంది అదే సంసారంలో సర్దుకుపోతుంది తనదొక నిర్మలమైన మనసు క్షణానికో చూపు క్షణానికో కోరిక క్షణానికో స్పర్శ తనని ఇష్టపడుతూ ఉంటాయి తనని కష్టపెడుతూ ఉంటాయి తనకి కష్టమైనా తనని తాను సమర్పించుకుంటుంది తనదొక విస్కృతమైన మనసు తనకీ ఒక భాష ఉన్నా చెప్పుకోలేదు తనకీ ఒక భావం ఉన్నా విప్పుకోలేదు గది లోకి వెళ్ళాకా మనిషి ఎదురుగా ఉంటే కళ్ళు మూసుకుని దీనంగా చేతుల్లో నలిగిపోతుంది గుళ్ళోకి వెళ్ళాకా దేవుడే ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తూ ఆయన పాదాల దగ్గర దీపంలా ఒదిగిపోతుంది తనదొక నిశ్చలమైన మనసు తనకిష్టమైన వస్త్రం అందంగా లేదని తనకిష్టమైన సువాసనలో మైకం లేదని కొత్త రంగులతో తనని అలంకరించి కొత్త కొత్త వాసనలతో తనని ద్రవీకరించి వారి సంతోషం కోసం తనని బలివ్వడానికి కోరికల ముళ్ళదారుల్లో ఊరేగిస్తున్నా మౌనంగా వాళ్ళని సంతోషపెడుతూ తాను దుఖపడుతూ ఊపిరి నిలుపుకుంటుంది తనదొక ఆర్ధ్రత గల మనసు తనకి జీవనమంటే ఇష్టం తనతో తనకి సహజీవనమంటే మరింత ఇష్టం తనదొక జీవం గల మనసు కానీ ఈ మానవమారణయజ్ఞంలో తనొక మరణించే మనస్సు! (ఆంధ్రప్రభ – 21 మార్చి 2010, ఆదివారంలో ప్రచురితమైన కవిత)

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cLJH3J

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

ఎన్నికల ప్రస్థానం-1 మున్సిపల్ సమరానికి చుట్టినారు శ్రీకారం.. ఎన్నికల చిత్రానికి వచ్చిందొక ఆకారం.. ఆశావహుల ఎదురుచూపులు వేసేందుకు నామినేషన్.. టికెట్ రాని నేతలంతా అవుతుంటిరి పరేషన్.. \11.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cspKOY

Posted by Katta

Krishna Mani కవిత

అలసిన చూపులు ****************** నూనె స్తంభ దీపాల వెలుగుల జాతరలో మురిసిన జీవులు కరెంటు తీగల జిలుగుల తోడుగ యంత్రాల ఉప్పెనలో తడిసి నవ నాగరిక నిర్మాణానికి పాదులు నింపి అలసిన బొక్కల ఒంగిన నడుములు ! మొఖాన కనిపించే రాతలెన్నో ? జరిగిన కథలకు సాక్షలెన్నో? ఆ మడతల అడుగున దాగిన ముత్యాలెన్నో? చేతి కర్రతో చెలిమిని చేస్తూ కనపడని వినబడని లోకంతో పలకరింపుకై వింత దిక్కులు చెక్కిలి తడిమిన ప్రేమలు చూపు కానక రాలిన చినుకులు పొరల కోతకు నిలబడు ఆశా చీమలెన్నో? కదలని తనవున చూపుకై అరాటమాడు పెగులెన్నో? మరిగిన రక్తం చల్లారిన దినమున బిడ్డల ప్రేమను పొందని గడపల కాసాయి కడుపున కన్నానేందుకని ఒంటరి అరణ్య రోదనలెన్నో ఎన్నో ...ఎన్నో ! ప్రేమకు అనాధలై అరాటపడు అభాగ్యుల నోరుమెదపని ముసలితనపు కన్నీరులెన్నో... ఎన్నో....ఎన్నో ! కొంగుచాటు కొడుకుల చూపుకు కానని యదలో మండు అగ్నిగోళాలెన్నో ...ఎన్నో ...ఎన్నో ! కడుపుకు గంజిలేక విల విలలాడి తేలిన బొక్కల అలసిన గుండెలెన్నో ... ఎన్నో ... ఎన్నో ! కృష్ణ మణి I 11-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsslIN

Posted by Katta

కంచర్ల సుబ్బానాయుడు కవిత

(^^^) మట్టి నేల పైన నింగి గొడుగు క్రింద నేల అరుగు మధ్యలో నడిచే చెట్లు మనుషులు వాన చెలికాని కౌగిటచేరి నేల ఏటా నిండు చూలాలౌతుంది అనుకోవడం తప్పు ఆమె నిత్యం పచ్చి బాలింతై పురిటి నొప్పుల తిప్పలు పడుతూనే వుంది నిజం చెప్పాలంటే మనం మట్టి మనుషులం కాదు కాదు మట్టిలో కలసిపోయే మనుషులం మట్టిలో పుట్టి మట్టిలో పెరికి మట్టిలో పోతాం కాబట్టి ఇందులో నిర్జీవుల పాత్ర వుంది సజీవుల యాత్ర వుంది మట్టి కడుపులో ఎన్ని ఆకు పచ్చ భూగోళాలు దాగి ఉన్నాయో విత్తు నాటామో లేదో అది పచ్చని ఆకుల హస్తాలతో నమస్కరిస్తూ పైకి లేస్తుంది మట్టి మనకు మెతుకౌతుంది బ్రతుకౌతుంది తన కడుపులో నాగేటిని గుచ్చి గుచ్చి దున్నినా తన ఉదరంలో ఎన్ని గడ్డపారలు తెచ్చి పెళ్ళగించినా నవ్వుతూ నవ్విస్తూ తాను మాగాణి పొలమై చినుకుల కునుకులకు మురిసి సిరుల మొలకౌతుంది మట్టి అమ్మై ఆకలి తీరుస్తుంది ప్రాణ చిలుక కాస్త ఎగిరి పోయాక ఈ కర్మ సంచిత దేహాన్ని పంచ భూతాల గేహాన్ని తన కడుపులో దాచుకొంటుంది చివరకు అంతా మట్టే అన్న నగ్న సత్యాన్ని చెప్పకనే చెబుతుంది. :putnam: కంచర్ల

by కంచర్ల సుబ్బానాయుడు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5e4O

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అ(నిశ్శబ్ధం) --------------------­-------- 1/నువ్వు నేను రెండు శరీరాలు పక్కపక్కగా పడుకున్నపుడు నా చేతులు లతల్లా నిన్ను అల్లుకుంటాయి నువ్వు నాలో బంధీవి కావు ఓ బాంధవ్యంలా 2/నేను నీ ముఖాన్ని ఓ పసికూనలా అరచేతుల్లోకి తీసుకున్నపుడు నీ వెచ్చని శ్వాసకు నా కనురెప్పలు వాలిపోతుంటే సహస్ర ఎడారుల్లో అప్పుడే తిరుగాడి అలసిపోయిన ఓ బాటసారిలా నేను నీ కౌగిళ్ళలో సేద తీరుతున్నట్టుగా 3/నా రెక్కలను అదిమినన్ను గట్టిగా హత్తుకున్నావు చూడు క్షణాల్లో చనిపోవడం అంటే ఇదేనేమొ 4/నా ప్రాణం అంటూ ఏది లేని కొన్ని నిమిషాలు నీలో ఏకమైనప్పుడు అప్పుడు నువ్వంటావు... నేను లేకపోతే ఏంచేస్తావని 5/అన్నం జిగురులా పెగలని నా పెదవులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో బిగ్గరగా రోదిస్తుంటే నీకు వినబడేలా...నన్ను దగ్గరకు తీసుకొని నువ్వంటావు ఇప్పుడేమైదని ఇంకొన్ని క్షణాలు నీలోనే కరుగుతానుగా అని నువ్వంటుంటే 6/స్థంబించిన ఓ చెట్టులా నేను భళ్ళున కూలి పడ్డట్టుగా అనిపిస్తుంది 7/ఇప్పుడు మళ్ళా ఒకసారి నీ పక్కగా పడుకోవాలి కొంచం ప్రేమను పులుముకోడానికి ఈ రాత్రికి. తిలక్ బొమ్మరాజు 11.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggjVU6

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

హృదయవీణను మీటితే పలికేవి అను`రాగాలే` ..@శర్మ \11.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd5fpA

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // మరి ఇక ఎలా ...? // సమాధానం తెలిసే ప్రశ్నలడుగుతావ్ మలుపు అందంగా ఉందని మజిలీని చేయలేం మరే ఋతువు మార్పుకు సంకేతమనుకుంటే ఎలా …. ఎప్పటిలా అలాగే ఇప్పటిలా ఇలాగే జరగనీ వెనక్కి వెళ్లి మిగిలినవి సరిచేసుకొనే వీలు లేదు ఐనా ఎవరి గమ్యాన్ని వాళ్ళు చేరాల్సిన వాళ్ళం ఒకానొక ప్రయాణంలో చిన్న ఉనికినితో తెలుసుకున్న వాళ్ళం సంశయాలు సందిగ్ధతలు లేని కాలంతో చెలిమి చేసే ఉమ్మడి కలలు నెరవేర కూడదని కోరుకొనే అమాయకులం ఇక ఎక్కడో ఒక అమావాస్య చీకట్లో పిలిచే పిలుపులే చుట్టు కుంటాయ్ ఆసరాగా ఉన్న కిటికీని అడుగుతాను మరిక నేనేం చేయాలి అని అది కినుకు వహించి ఒక వంకర నవ్వు తో ఇలా అంటుంది నీ చేతుల్లో లేని ప్రయత్నాలని ఆపాలనుకుంటే ఎలా అని మరి ఇక ఎలా …. ? Date: 10/03/14

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUpRYq

Posted by Katta

Kavi Yakoob కవిత

CONGRATULATIONS !! డా.నలిమెల భాస్కర్ కు కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం డాక్టర్ నలిమెల భాస్కర్ 'స్మారక శిలలు ' నవలకు నలిమెల భాస్కర్ గారికి కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం -2013 జయహో !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oHgQgy

Posted by Katta

Kavi Yakoob కవిత

ABOUT POETRY ~ "ఒక మంచి కవితని చదవడం / దానిపై వ్యాఖ్యానాన్ని చదవడం అంటే, 'మరు క్షణం లో ఎడురవబోయే సన్నివేశం లో ఎన్ని ఆశ్చర్యాలని రహస్యంగా దాచిపెట్టుకుని వుందో తెలియని జీవితం' లోలోపలికి ఒక్క క్షణం తరచి చూడడమే కదా ! ." -koduri vijaykumar [ఒక కామెంట్ నుంచి... :) ]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oHgRBl

Posted by Katta

Bhaskar Palamuru కవిత

ఒకరి కోసం మరొకరం వేచి చూడటమే కదా ప్రేమంటే దారులు వేరైనప్పుడు ఆలోచనలు అల్లకల్లోలంలా మారినప్పుడు దేహాలు వెదుకుతూనే ఉంటాయి కళ్ళు ఆలింగనంలో అరమోడ్పులై పోతాయి నీ కోసం నేను నా కోసం నీవు అనుకుంటూ సాగిపోతూ కదులుతూ .. పారే ప్రవాహంలా చూపులు వాలి పోతాయి ఏదో మార్మికత్వం మైకంలా అల్లుకుపోతుంది గుండెల్లో అలజడులు రేపుతుంది ఆశలు చినుకుల్లా కోరికలు ముల్లులా గుచ్చుకుంటాయి .. అయినా ఆరాటం ఆగదు ఆనందం ఆవిరైపోయినప్పుడు కనురెప్పలు దేహాన్ని తాకుతాయి అక్కడక్కడా నక్షత్రాల్లా నిమురుతాయి .. ఓహ్ ప్రేమ జీవన మాధుర్యాన్ని వెలిగించే దీపం కదా అందుకే అదంటే అందరికి ఇష్టం!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUpOvT

Posted by Katta

Rajeswararao Konda కవిత



by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1emGsuh

Posted by Katta

Panasakarla Prakash కవిత

శుభోదయ‍‍‍౦ కిరణాల సూదులు నాన్న అరుపులై గుచ్చుకు౦టున్నాయ్ తెల్లారి౦ది లెగరా......గాడిద.. అని తిడుతూ.. పూలు అమ్మ పిలుపులా నిశ్శబ్ద౦గా విచ్చుకు౦టున్నాయ్ తొ౦దరగా లేచి ముఖ౦ కడుక్కోమ్మా టిఫిన్ చేద్దువుగాని అని.....నాకు మాత్రమే వినిపి౦చేలా చెబుతూ............ చి౦త చెట్టు చిటారు కొమ్మ మీద‌ కొ౦గలు... ఎగరాల్సిన దిక్కును ఎ౦చుకు౦టున్నాయ్ ఇప్పుడే నిద్ర లేచిన కొబ్బరి చెట్లు... ఇ౦కా మత్తులోనే నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతున్నాయ్.... టిఫినీకర్రలు పట్టుకుని... మా ఇ౦టి గుమ్మ౦ము౦దు పాలకోస౦ రోజూ వచ్చే పిల్లలు... వ౦టి౦టి ప్రయోగ శాలలో పాలూ నీళ్ళూ సమపాళ్ళలో కలుపుతూ అమ్మ..... ఏమే ఇ౦కా ఎ౦తసేపు.. గేదికి చిట్టు తౌడు కలిపి తీసుకురా....అ౦టూ పిల్లలతో పాటూ గుమ్మ౦ దగ్గర నిలబడి నాన్న‌ వాడి౦కా లేచాడా లేదా.....అని అడిగిన ప్రశ్నకు.. ఉలిక్కి పడి లేస్తూ ఆ....ఆ....లేచా నాన్నా...... అ౦టూ.......నా సమాధాన౦...... ఏ పనిలో ఉన్నా అమ్మా నాన్నల కళ్ళన్నీ ఇ౦కా పసిపాపల్లా కనిపి౦చే పిల్లలమీదే.... పోపుడబ్బాలో దాచిన డబ్బులిచ్ఛి ఊ...జాగ్రత్తగా వెల్లరా కాలేజీకి........అ౦ది అమ్మ‌ దూర౦ను౦చి చూసినట్టే ఉన్నాడు........ పని చేసుకు౦టూనే ముసి ముసిగా నవ్వుతూ జాగ్రత్తరా అని..నేను వెల్తున్న వైపుకి ఒక్కసారి చూసి మళ్ళీ పనిలో పడిపోయాడు నాన్న.. దృశ్య౦ రక్తి కట్టడ౦తో........ మా వాకిల౦తా వెలుతురుతో ని౦డిపోయి౦ది.... పనసకర్ల‌ 11/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUe10v

Posted by Katta

Kapila Ramkumar కవిత

మాష్టారూ..జవాబు చెప్పరూ... ! Posted on: Sun 09 Mar 23:46:09.196764 2014 తెల్లని పూలు విరిసిన పత్తి తోటలో ఆ పిల్ల ... పదహారేళ్ల ఆ పిల్ల వొక్కో పువ్వూ గంపలోకేరుతూ.... .. తెగిన ఆశల రెక్కల్ని కసితో శూన్యంలోకి విసిరేస్తుంది రెండు విరుద్ధాంశాలు వొకేసారి కూడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. బహుశా, భరించలేకపోతుందనుకుంటా - ఆలోచనల చిగుళ్లకు దిగులు చీడ పట్టినట్టు.. ముఖం- అంతరంగాన్ని బహిరంతరం చేస్తుంది ఆ పిల్ల నా శిష్యురాల్లాగే వుంది ఆశ్చర్యం లేదు - నిజంగా, నా శిష్యురాలే.. ఏడాది క్రితం - నేనూ తనూ వొకే తరగతి గదిలో.. నా పాఠ్యాంశాలు వింటూ ప్రతిసారి తనే ప్రథమం సాధిస్తూ - ఆత్మాభిమానం ఎక్కువ ! చదువుకోవాలనే కోరికను మాత్రం పేదరికం పాము మింగేసింది చదువా ! తండ్రి లేని ఇంటికి కాసింత చేయూతా ! రెండు విరుద్ధ ఆలోచనల మధ్య .. తనిప్పుడు నలిగిపోతుంది వో రోజు పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత నన్నడిగింది - ''మాష్టారూ.. చదువుకోవాలంటే కష్టపడాలండీ..!' - బాల సుధాకర్‌ మౌళి 9676493680 http://ift.tt/1kcJCWm

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kcJB4I

Posted by Katta

Nvn Chary కవిత

ఎన్నికలలో ఎన్ని "కలలో " మరెన్ని" కళలో " నటనలు నాట్యాలు ఓటరునూరించే విరించిని మించిన వాగ్దానాలు చట్ట సభల్ని చట్టు బండలు చేసిన ముఖాలే మాస్కులు మార్చుకుంటూ జనాన్ని ఏమార్చు కుంటూ పార్టీల మాస్కులు మార్చుకుంటూ తస్మాత్ జాగ్రత్త సావధాన సావధాన సుముహూర్త సావధాన ఓటుకు నోటు తీసుకుంటే మన నోటికి తాళాలే ఒక్కరోజు ఆశ పడితే ఐదేళ్ళు మన బ్రతుకులు కుదేలే ఓటు ఆయుధమున్న అర్జునులం మనం లక్ష్యాన్ని గురిపెడదాం ఓట్ల పండుగ నాడే కాదు బిర్యానీ ప్రతిరోజూ వసంతం విరియాలి

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i1AV0c

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవితా సంపుటి -5 )( ---------------------)( సంపుటి కవయిత్రి:-శిలాలోలిత ******************* పరిచయం చేస్తున్నది:-రాజారామ్.టి ################# -సంపుటి పేరు:-గాజునది¬- -------------------- " హైద్రాబాద్ నా మతం"అనగలిగే ధైర్యంతో పురుషాధిక్యసమాజ"గాజుముక్కల వంతెన' మీద" కొత్తదేహపటం" ఎగరేస్త"తెగిపడ్డ సీతాకోకరెక్కలు"చూసీ" బాధార్ణవగీతి"ని 'సముద్రఘోష"గా చేసీ మొగలిపువ్వు-నందివర్ధనం"ల సమాగమసంబంధం వారు"కోల్పోయినతరువాత"కానీ అసలు విషయం తెలీదనీ అంటూ 'కవిత్వం""వేణురాగపుపూలుగా మారి"కొత్తరెక్కలు" పుట్టించ్చుకొని అవి "మట్టిధుప్పటిపైపరుచుకున్నదృశ్యాన్నిదర్శిస్తూ"కన్నీటిచెలిమలోనాన్న"నుతలుచుకోంటూ"మనుషులుమాట్లాడుకోవడంలేదు"అన్న భారతీవ్రత"తో రాయడమంటే ఏమిటని చింతన చేస్తూ క్లుప్తంగా గుప్తంగా స్త్రీలకన్నీటిసిరాతో కవిత్వచంద్రవంకల్ని దీపశిఖప్రజ్వలనంతో గాజునది ని ప్రజ్వలింప చేసిన రచయిత్రి శిలాలోలిత గారు. "కవిత్వమొకౌఉరట/నాకొకస్వాంతన/నా కొక ఆలంబన/నాకొక ఆత్మతృప్తి/నాకొక అఙాత చక్షువు/ జీవన దాహార్తిలో నీటిచెలిమ'-అని అంటున్న శిలాలోలిత పేరు వినగానే ప్రముఖ మనోవైఙానిక నవలా రచయిత దగ్గర పరిశోదన చేస్తూ దగ్ధశిలైన రేవతిదేవి కనురెప్పలముందు అలా కదిలిపోతుంది. శిలాలోలిత గారు చాలమందిలా లోలకంలా డోలనం చేసే కవయిత్రి కాదు.వొకానొక దృక్పథంతో వొక నిబద్దతతో కవిత్వం రాస్తున్న కవయిత్రి.పసుపులేటి గీత గారన్నట్లుగా "స్త్రేత్వం నుంచి మనిషి తనం లోకి సాగే ప్రయాణం తాత్వికంగా చేస్తున్న కవయిత్రి ఆమె. కొన్ని సందర్భాల సమాహారాన్ని కవిత్వంలోకి అనువదించిన మంచి కవితా సంపుటి "గాజునది'.సాహితీవిమర్శకుడు గుడిపాటి గారు " శిలాలోలిత స్త్రే వాద ప్రేరణతో కవిత్వం రాసినప్పటికి అంతకు మించిన వస్తు విస్తృతిని సాదించారన్నారు.ఏ కవైనా తన కవిత్వంలో వొక కీలకమైన కవిత శీర్షికనే సంపుటికీ పేరుగా ఉంచటం సాంప్రదాయం.ఈ సంపుటిలో గాజునది అనే పేరుతో ఏ కవిత లేదు.కవయిత్రి తాను విశ్వసించిన వాదానికీ ప్రతీకగా ఈ పేరును సంపుటికి ఉంచి వుండవచ్చు. గాజు పెళుసైనది సున్నితమైనది కూడా.ఏ చిన్న గాయానికైనా ముక్కలుముక్కలయ్యే స్వభావం గాజుది.నది ప్రవహిస్తుంది.ప్రవహించినట్లు కనిపించినా ఆ నదిలో స్థిరత్వం వుంటుంది.స్త్రీ మనసు పురుషాహంకారపు సమ్మెట దెబ్బలకు గాజులా చిట్లిపొయినా ఆమె మనసులో స్థిరత్వం స్థిరీకృతంగా ఉంటుంది కాబట్టి గాజునది అనే పదాన్ని తనకవిత్వంలోని వాదానికీ ప్రతీకగా స్వీకరించివుండవచ్చునని అనుకుంటున్నా. "పురుషామ్య సగాన్ని ఇంకెన్నోసగాలుగాకత్తిరించి రూపమే పోల్చుకోకుండా చేస్తున్నది కఠిన నిజం"-అని అనటంలోనూ;"ఇలా మిగిలిన ఆకాశంలో సగమా?పురుషస్వామ్య అహంకారం తెగ్గోసి మిగిల్చిన సగమా?......ఎల్లప్పుడూ నిత్యనూతనంగా నిల్చునే మనం సమరభూములం'-అని పేర్కోనటం లోనూ,"ఇగోల,అహంకారాల మూల స్వభావాల్ని ప్రశ్నించి పరిశీలించి పరిశోదించే మేధోజీవులు స్త్రీలు.....సమాజంలో పురుషులతో సమానస్థితి కోసం పోరాడి గెలిచిన వీరవనితలు"-అని రాయటంలో మనం శిలాలోలిత గారి కవితాదృక్ప్తథాన్ని అర్థంచేసుకోవచ్చు.పురుషస్వామ్యవ్యవస్థలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను వారికీ అయిన గాయాలగాట్లను మా న్చడానికి "ఆశను ప్రోది చేసి రాలిపోతున్న ఆ స్త్రీలకు చైతన్యమిచ్చే కవితల్ని ఈ సంపుటంతా పరిచారు. స్త్రీ పురుషులు ఏలాంటి ఆధిపత్య ధోరణి లేకుండా పరస్పర అవగాహనతో సహాకారంతో బ్రతకాలనే ఆశను కవయిత్రి"మొగలిపువ్వు-నందివర్దనం"-అనే కవితలో వ్యక్తం చేశారు.ఇదొక కవితాత్మక కథనంగా శిలాలోలిత గారు మలిచారు.'నందివర్ధనంతెల్లటి నవ్వుతోనూ/మొగలిపువ్వు పరిమళ భరితంగానూ/మన ముందుండే రోజు కోసం సప్నిద్దాం"-అని అనటంలో కవయిత్రి కి గల సామరస్య దృక్ఫధం ద్యోతకం అవుతుంది.ఈనాటికీ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు.రోజురోజుకీ ఆ అత్యాచారాలకీ మరో కొత్త పుటలు తెరుచుకొంటున్నయి.అందుకే కవయుత్రి "నిజంగానిజమే/ఆమె నిప్పు కనికెల చర్మాన్ని చుట్టుకొని మండుతున్నట్లుంది"అని చేలరేగుతున్న సంఘర్షణల నడుమ మిణుకు మిణుకు మంటున్నాచైతన్యం గల స్త్రీ "సమానత్వపు బావుటాను ధరించి/ బ్రతుకు ఉలితోతననుతాను చేక్కుకొంటున్న శిల్పి/కొత్తపటంతో కొంగొత్త స్వేచ్చ తో /సగర్వంగా నిలబడిన శిఖరం"-అని కవయిత్రీ ఆమెను తీర్చిదిద్దింది. అతడు-ఆమె ల మద్య గల వ్యత్యాసాన్ని అతి తేలిక మాటలతో మాటలపొదుపుతో వొక గొప్ప శిల్పాన్ని కవయిత్రి సాదించింది" అనగనగా ఒక ఇల్లు"-అనే కవితలో.అతడు/ప్యాంటు తొడుక్కునివెళ్తాడు/ఆమే ఇంటిని కూడా తొడుక్కొని వెళ్తుంది'.ఈ వొక్క వాక్యంలోనే ఉద్యోగిని సాదకబాధకాలన్ని ఈ కవయిత్రి పాఠకులకు స్ఫురణకు తెస్తుంది".ఆర్థిక సంబంధాలే జీవితాన్ని నిర్దేశిస్తే ఆమె కూడా సాటి మనిషేనన్న ఇంగిత ఙానంకొరవడితే ఏమవుతుందో శిలాలోలిత గారు సైన్స్ తో కవిత్వాన్ని అనుసంధానించి "కాంతి+కాంతి= చీకటి అనే కవితలో చమత్కారంగా చెప్పినా ఈ కవిత స్త్రీల జీవితాల్లొని చీకటి చారికల్ని బయట పెడుతుంది. ఈ కవయిత్రి స్త్రీ వాదాన్ని తన కవిత్వంలో ఏంత కొనసాగించినా తాను నివసించిన సమాజంలో ప్రంచీకరణ,మతోన్మాద తీవ్రవాదం,తెలంగాణా ఉద్యమం,అమెరికా మానసంబం ధాలాలోని అవకతవకలు,హైద్రాబాద్ లోని బాంబ్ పేలుళ్లు,సన్నిహితుల మరణం ఇలాంటివన్ని కొన్ని శిలాలోలిత కలంలోంచి కవిత్వమై ఆమెనొక ఉత్తమ కవయిత్రి గా నిలబెడాతాయి.వాదాలా కళ్ళజోడు లేకుండా చూసినా వాటిని అమె కవితగా చేసిన శిల్ప నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా వుండలేం.మతోన్మాదాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ నా మతం అనగలిగే ధైర్యం ఆమెది."దుఃఖం అన్ని మతాలకు సమానమే నంటూ మీ అమ్మ మా అమ్మ వొకే దుఃఖంతో విలపిస్తున్నారు-అని నిర్మోహమాటంగా అన గలిగింది.హృదయాన్ని కరగించే కదిలించే పదాల పేర్పు ఈమె సొంతం. "దుఃఖం గుండేను కావలించుక కూర్చుంది"-అని దిగాలుగా అన్న ప్రపంచీకరణ వేయి నాల్కల పడగల్ని దర్శిస్తూ స్త్రీలందరీ తరపున వకాల్తా పుచ్చుకొన్న న్యాయవాదిని నేను"-అంటూ ప్రపంచీకరణ ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది ఆమె.జరిగినా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆమెను ఆ వైపుగా ఆలోచింపచేయించి కవిత్వమయ్యాయి. మరణం గురించిన చింతన ఎందరో చేశారు.ఈ కవయిత్రి కూడా తన దైన తాత్విక చింతన మరణాన్ని గురించి ఈ సంపుటిలో చేసింది.బైరాగి కవి మరణాన్ని ఇలా వ్యాఖ్యానిస్తాడు."ఏమంటే ఏదీ చావదు ఇచట/ద్రవ్యం లోంచి రూపంలోకి/రూపంలోంచి భావంలోకి/బీజం లోంచి భావంలోకి/ రూపం మారుతున్నది ఒకే శక్తి/రాలుటాకుసెజ్జె లోంచి క్రోంజిగురులు లేచినట్లు"-ఇందు లోని తాత్వికతా ఒకలా వుంటే మహాశూన్యం లో కవి మరో రకంగా'ప్రభువు వద్దకు పరుగెత్తున్నాను / దారిలో మృత్యువు కలిసింది/వణికిపోయాను/చావంటే భయంతో కాదు/బ్రతుకంటే యిష్టంతో/ ఎంతిష్టమంటే చావును చంపి బ్రతకాలన్నంత ఇష్టం" అని చింతన చేస్తాడు.గాజునది లో శిలాలోలిత తనదైన ధోరణిలో మరణాన్ని వ్యాఖ్యానించింది."మనం కూడా అనుకుంటాం/చొక్కా తొడుక్కున్నంతా తేలిగ్గా/బతికేయేచ్చనుకుంటాం/ ఈశరీరం శాశ్వతమనుకుంటాం/రోజులన్నీ మనవేననుకుంటాం " అని ఆమె తేలికగానే అన్న ఆ మాటల్లో ఏంతోబరువుధ్వనిస్తుంది.జీవితచలనసూత్రాలుఈమెకీబాగాతెలుసు."మనుషులంతాఇలావెళ్ళిపోతున్నారేమిటిమొన్నున్నారు./నిన్నున్నారు/నేడున్నారనుకుంటేలేరు"అంటూ తన తాత్వికతను వెళ్ళడిస్తుంది. హైద్రాబాద్ పేళ్ళులను,సునామీ విషాదాన్ని ఈమె కవిత్వ వేణువు ఏంత బరువెక్కిన దుఃఖంతో పలికించిందో,అంతే స్వరలేపనంతో చౌరాసియా గాన మాధుర్యాన్నీ రాగాలబాణాలను సంధిస్తూ స్వర ఝరులను వూదుతుంది. నాన్న గురించి కవిత "కన్నీటి చెలిమలో నాన్నా"అనే కవిత"కారు అద్దంపై ఎంత తుడుస్తున్న తడిసే వర్షపు చుక్కలా"మన గుండెల్ని తడుపుతుంది.మనిషే నిలిచే వెలుగు రవ్వ-అని అనే కవిత ఐదుపొరలు ఈ సంపుటిలో కవయిత్రి శిల్ప వైవిధ్యానికి తార్కాణం.శిలాలోలిత గార్నికవిత్వం కొనసాగించమని... కోరుతున్నాను.ఆరోగ్యం సహకరించక పోవటం వల్లా ఈ వారం కొత్త సంపుటిని పరిచయం చేయలేక పోతున్నందుకు కవి మిత్రుల్నీ అన్యథా భావించవద్దని కోరుతున్నాను.కొందరి మిత్రుల కోరిక కారణంగా" శిలాలోలిత" గారి "గాజు నది" సంపుటి పరిచయాన్ని మరోసారి మీకు పరిచయం చేస్తూ వచ్చే వారం మన మిత్రుల కొత్త కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flIQ8U

Posted by Katta