పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి పుష్పవిలాపం ఆ వస్త్రమంటే తనకి చాలా ఇష్టం ఆ పరిమళమంటే తనకి మరింత ఇష్టం ఆ వస్త్రం చినిగిపోయినా ఆ పరిమళం ఆవిరై పోయినా అదే వస్త్రాన్ని కప్పుకుంటుంది అదే పరిమళంతో ఆకట్టుకుంటుంది తనదొక దివ్యమైన మనసు ఆ ప్రాంగణమంటే తనకి చాలా ఇష్టం ఆ నివాసమంటే తనకి మరింత ఇష్టం ప్రాంగణాలు మారినా నివాసాలు మారినా అదే జీవితం కొనసాగిస్తుంది అదే సంసారంలో సర్దుకుపోతుంది తనదొక నిర్మలమైన మనసు క్షణానికో చూపు క్షణానికో కోరిక క్షణానికో స్పర్శ తనని ఇష్టపడుతూ ఉంటాయి తనని కష్టపెడుతూ ఉంటాయి తనకి కష్టమైనా తనని తాను సమర్పించుకుంటుంది తనదొక విస్కృతమైన మనసు తనకీ ఒక భాష ఉన్నా చెప్పుకోలేదు తనకీ ఒక భావం ఉన్నా విప్పుకోలేదు గది లోకి వెళ్ళాకా మనిషి ఎదురుగా ఉంటే కళ్ళు మూసుకుని దీనంగా చేతుల్లో నలిగిపోతుంది గుళ్ళోకి వెళ్ళాకా దేవుడే ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తూ ఆయన పాదాల దగ్గర దీపంలా ఒదిగిపోతుంది తనదొక నిశ్చలమైన మనసు తనకిష్టమైన వస్త్రం అందంగా లేదని తనకిష్టమైన సువాసనలో మైకం లేదని కొత్త రంగులతో తనని అలంకరించి కొత్త కొత్త వాసనలతో తనని ద్రవీకరించి వారి సంతోషం కోసం తనని బలివ్వడానికి కోరికల ముళ్ళదారుల్లో ఊరేగిస్తున్నా మౌనంగా వాళ్ళని సంతోషపెడుతూ తాను దుఖపడుతూ ఊపిరి నిలుపుకుంటుంది తనదొక ఆర్ధ్రత గల మనసు తనకి జీవనమంటే ఇష్టం తనతో తనకి సహజీవనమంటే మరింత ఇష్టం తనదొక జీవం గల మనసు కానీ ఈ మానవమారణయజ్ఞంలో తనొక మరణించే మనస్సు! (ఆంధ్రప్రభ – 21 మార్చి 2010, ఆదివారంలో ప్రచురితమైన కవిత)

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cLJH3J

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి