పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జూన్ 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని (193 నుండి 211 వరకు)// 193. వెలుగులో పరిశ్రమిస్తున్న పగలు నేనే చీకటిలో విశ్రమిస్తున్న రేయిని నేనే తన చుట్టూ తాను పరిబ్రమిస్తున్న భూమి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 194. శూన్యంలోకి శాటిలైట్లు పంపిస్తున్న నాగరికుడు నేనే భూమాతని కాలుష్యం చేస్తున్న అనాగరికుడూ నేనే సమతుల్యం లేని పలితం విషతుల్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 195. రాత్రి సైతం పూర్తిగ ఉండని విద్యుత్ సరఫరా నేనే పారిశ్రామిక అభివృద్ది చేస్తానంటూ ప్రగల్బాలు పలికేదీ నేనే ఉత్పత్తి మాట మరచేవి ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 196. కడుపు నిండని కళాకారుడు నేనే కీర్తికాంక్ష తరగని దాతనీ నేనే అర్ధాకలి తీర్చేది మృత్యువు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 197. ఆలోచనలతో పదునెక్కిన మేధావి నేనే ఆవలింతలతో పరుపుదిగని బద్దకస్తుడూ నేనే ఆచరణకు నోచుకోని ఆవిష్కరణల గమ్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 198. ఆడబిడ్డలకు ఆంక్షలు పెట్టే సమాజాన్ని నేనే వాడికేం మగాడంటూ వెనకేసుకొచ్చే కుటుంబాన్ని నేనే సభ్యత సంస్కారం మరిచాక మానవుడూ దానవుడూ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 199. సర్వాంతర్యామికి గుడికట్టిన స్థల పురాణం నేనే సర్వదర్శనానికి వెలపెట్టిన ధర్మకర్తనూ నేనే పేదలకి దర్శనమీయక అభాసుపాలైంది దేవుడొక్కడే నేను మాత్రం ఇద్దరిని. 200. శవాలు దొరికిన చుండూరు దమనకాండ నేనే సాక్షాలు దొరకని న్యాయ పరిశోదన అరణ్యకాండ నేనే దురాగతాన్ని ఎండగట్టలేని దృతరాష్ట్రని నీతి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 201. ఉద్యమాన్ని ముందుండి నడిపిన సాహిత్యాన్ని నేనే బండబూతులు రాసి కవినన్న కపిని నేనే చరిత్రకి సాక్ష్యం సమకాలీన సాహిత్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 202. విద్య వైద్యం ప్రాధమిక హక్కులకి పైకం పెట్టిన ప్రభుత్వం నేనే అన్నీ ఉచితమంటూ మానిఫెస్టో ప్రకటించిన రాజకీయం నేనే నాకింత బిక్షవేసి ఊరిని దోచుకోమన్న ఓటరు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 203. పట్టెడన్నం బిక్ష వేయని స్వార్ధపరుడు నేనే దేవుడికి ముడుపులు కట్టే బక్తుడిని నేనే మానవుడే మాదవుడని మరిచింది లోభి ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 204. కవిగా నీతిభోదలు చేస్తూ అఃతర్జాలంలో నేనే వక్రబుద్దులతో సమాజంలో మృగాడిగా తిరుగుతూ నేనే దొరకనులే అన్న బ్రమలో ఉండేది దొంగ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 205. స్వ పరిపాలన నినాదమై నేనే కుటుంబ పాలన నిర్వహిస్తూ నేనే తీరిన కోరిక ముఖ్యమంత్రి పదవి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 206. ముంపు గ్రామాలు ఆంధ్రావని తేల్చిన కేంద్రప్రభుత్వ ఆర్డినెన్సు నేనే ఆగ్రామల విద్యార్ధులకు బస్పాసులివ్వని తెలంగాణ ప్రభుత్వాన్నీ నేనే ఉద్యమాలు ప్రభుత్వాల నడుమ నిర్బాగ్యులైన నిర్వాసితులంతా ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 207. MRPలకు అమ్మకాలు నెరిపే చిల్లర కొట్టు నేనే discountలు ఆఫర్లు ఇచ్చే బడా బడా మాల్సు నేనే FDIల పుణ్యమాని సగం అమ్ముడుపోయిన భారతావని ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 208. ఎర్రచందనం ఎగుమతిచేసే స్మగ్లరు నేనే హవాలాలో పార్టీఫండు పంపే రాజపోషకుడు నేనే దొరకడెన్నడూ స్మగ్లరు; దొరికేది కూలీ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 209. విద్యార్ధులకి నీతిపాఠాలు చెప్పే గురువుని నేనే దొంగ సర్టిఫికేట్లతో చదువుకున్న B.E.D విద్యార్ధి నేనే గుణం లేని గురువులు చెప్పే పాఠంలో మిగిలింది వృత్తి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 210. సంక్రాంతి పండగని దేశ విదేశాల నుంచి వచ్చేది నేనే జూదమే ప్రతిష్ఠగా జీవితాన్ని పందెం కాసేది నేనే పండగనే పందెం చేయగలిగింది భీమవరం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 211. సంక్షేమ పధకాలు మా ఘనతంటూ ప్రకటించే పార్టీ నేనే తలసరి అప్పులు, లోటు బడ్జెట్ల ప్రభుత్వాన్ని నేనే ఎవడబ్బ సొమ్మంటూ ప్రశ్నించలేనిది గొర్రలమంద ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని.......23.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMS2XZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి