పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//107 DSNR to SEC// కాకా నాల్గు దినాలైంది కనిపిస్తలేవ్? సుస్తీసేసుండె దావఖన బోయిన టికెట్ టికెట్ ముషీరాబాదా అన్నా పదమూడు రూపాయలు మూడు రూపాయలు చిల్లరియ్యన్నా... టికెట్ తీసుకుని కిటికీలోంచి చూస్తున్నా కొండను తవ్వి కట్టిన బవంతులు సిగ్నల్ దగ్గర పెరిగిన బిచ్చగాళ్ళు ఎన్ని చెరువులుండేవి ఈ పట్నంలో ఇప్పుడన్ని షాపులముందూ వాటరు బాటిల్సే మొలలో చిన్న గుడ్డ సంచి నోట్లో ఆకు వక్కతొ పండిన ఆ అవ్వ చటాకో అర్దపావో కూరలమ్ముతూ కంటబడుతుందనుకుంటే నిరాశే ఆవహించిది ఆ పుటెపాత్ మీద ఆమేనా ఆ ముసలి లంబాడీ చిన్నప్పుడు బాలానగర్ రింగులో ఎడ్లబండి మీద సీతాఫలాలు అమ్మిన ఆమేనా సంఘటిత సంచార జాతులూ ఒంటరివాళ్ళయ్యరే ఆ పట్నం ఆ లష్కరూ మారిపోయిందే... ఆలోచనలకి సడన్ బ్రేక్ పడ్డ బస్సు అందరినీ అటో ఇటో విసిరేసింది ఒక చేత్తో తోలు డబ్బు సంచి ఒకచేత్తో టికెట్లు తూలుకుంటా పోయి డ్రైవరు దగ్గర ఆగాడు కండక్టర్ ఇంద అని సాయి బాబా గుడికి పోయొస్తున్న బిడ్డ సంగం అరటి పండు కండక్టరుకి ఇచ్చి ఇంకో పండు డ్రైవరు ఇవ్వమని ఇస్తే డ్రైవర్ ఆలీ సాబ్ నాకు సగమే నీకు మొత్తం పండు దానే దానేమే కానేవాలేకా నామ్మ్ అరటిపండు అరటిపండుమే కానేవాలేకా నామ్మ్ అంటూ కండక్టర్ నువ్వు నీ బిడ్డలు సల్లగుండాలె అక్కా చిలుకూరి బాలజీ జై అనగానే బస్సంతా అమ్మల అక్కల జ్ణాపకాలే నేనూ అరటిపండు అడిగి తిన్నాను దిగుతూ కండక్టరుతో హైదరబాదు మారలేదు అన్నంతలోనే రైట్ రైటంటూ బస్సు ముందుకు సాగిపోయింది....10.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nf9Wnl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి