పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవితా సంపుటి -5 )( ---------------------)( సంపుటి కవయిత్రి:-శిలాలోలిత ******************* పరిచయం చేస్తున్నది:-రాజారామ్.టి ################# -సంపుటి పేరు:-గాజునది¬- -------------------- " హైద్రాబాద్ నా మతం"అనగలిగే ధైర్యంతో పురుషాధిక్యసమాజ"గాజుముక్కల వంతెన' మీద" కొత్తదేహపటం" ఎగరేస్త"తెగిపడ్డ సీతాకోకరెక్కలు"చూసీ" బాధార్ణవగీతి"ని 'సముద్రఘోష"గా చేసీ మొగలిపువ్వు-నందివర్ధనం"ల సమాగమసంబంధం వారు"కోల్పోయినతరువాత"కానీ అసలు విషయం తెలీదనీ అంటూ 'కవిత్వం""వేణురాగపుపూలుగా మారి"కొత్తరెక్కలు" పుట్టించ్చుకొని అవి "మట్టిధుప్పటిపైపరుచుకున్నదృశ్యాన్నిదర్శిస్తూ"కన్నీటిచెలిమలోనాన్న"నుతలుచుకోంటూ"మనుషులుమాట్లాడుకోవడంలేదు"అన్న భారతీవ్రత"తో రాయడమంటే ఏమిటని చింతన చేస్తూ క్లుప్తంగా గుప్తంగా స్త్రీలకన్నీటిసిరాతో కవిత్వచంద్రవంకల్ని దీపశిఖప్రజ్వలనంతో గాజునది ని ప్రజ్వలింప చేసిన రచయిత్రి శిలాలోలిత గారు. "కవిత్వమొకౌఉరట/నాకొకస్వాంతన/నా కొక ఆలంబన/నాకొక ఆత్మతృప్తి/నాకొక అఙాత చక్షువు/ జీవన దాహార్తిలో నీటిచెలిమ'-అని అంటున్న శిలాలోలిత పేరు వినగానే ప్రముఖ మనోవైఙానిక నవలా రచయిత దగ్గర పరిశోదన చేస్తూ దగ్ధశిలైన రేవతిదేవి కనురెప్పలముందు అలా కదిలిపోతుంది. శిలాలోలిత గారు చాలమందిలా లోలకంలా డోలనం చేసే కవయిత్రి కాదు.వొకానొక దృక్పథంతో వొక నిబద్దతతో కవిత్వం రాస్తున్న కవయిత్రి.పసుపులేటి గీత గారన్నట్లుగా "స్త్రేత్వం నుంచి మనిషి తనం లోకి సాగే ప్రయాణం తాత్వికంగా చేస్తున్న కవయిత్రి ఆమె. కొన్ని సందర్భాల సమాహారాన్ని కవిత్వంలోకి అనువదించిన మంచి కవితా సంపుటి "గాజునది'.సాహితీవిమర్శకుడు గుడిపాటి గారు " శిలాలోలిత స్త్రే వాద ప్రేరణతో కవిత్వం రాసినప్పటికి అంతకు మించిన వస్తు విస్తృతిని సాదించారన్నారు.ఏ కవైనా తన కవిత్వంలో వొక కీలకమైన కవిత శీర్షికనే సంపుటికీ పేరుగా ఉంచటం సాంప్రదాయం.ఈ సంపుటిలో గాజునది అనే పేరుతో ఏ కవిత లేదు.కవయిత్రి తాను విశ్వసించిన వాదానికీ ప్రతీకగా ఈ పేరును సంపుటికి ఉంచి వుండవచ్చు. గాజు పెళుసైనది సున్నితమైనది కూడా.ఏ చిన్న గాయానికైనా ముక్కలుముక్కలయ్యే స్వభావం గాజుది.నది ప్రవహిస్తుంది.ప్రవహించినట్లు కనిపించినా ఆ నదిలో స్థిరత్వం వుంటుంది.స్త్రీ మనసు పురుషాహంకారపు సమ్మెట దెబ్బలకు గాజులా చిట్లిపొయినా ఆమె మనసులో స్థిరత్వం స్థిరీకృతంగా ఉంటుంది కాబట్టి గాజునది అనే పదాన్ని తనకవిత్వంలోని వాదానికీ ప్రతీకగా స్వీకరించివుండవచ్చునని అనుకుంటున్నా. "పురుషామ్య సగాన్ని ఇంకెన్నోసగాలుగాకత్తిరించి రూపమే పోల్చుకోకుండా చేస్తున్నది కఠిన నిజం"-అని అనటంలోనూ;"ఇలా మిగిలిన ఆకాశంలో సగమా?పురుషస్వామ్య అహంకారం తెగ్గోసి మిగిల్చిన సగమా?......ఎల్లప్పుడూ నిత్యనూతనంగా నిల్చునే మనం సమరభూములం'-అని పేర్కోనటం లోనూ,"ఇగోల,అహంకారాల మూల స్వభావాల్ని ప్రశ్నించి పరిశీలించి పరిశోదించే మేధోజీవులు స్త్రీలు.....సమాజంలో పురుషులతో సమానస్థితి కోసం పోరాడి గెలిచిన వీరవనితలు"-అని రాయటంలో మనం శిలాలోలిత గారి కవితాదృక్ప్తథాన్ని అర్థంచేసుకోవచ్చు.పురుషస్వామ్యవ్యవస్థలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను వారికీ అయిన గాయాలగాట్లను మా న్చడానికి "ఆశను ప్రోది చేసి రాలిపోతున్న ఆ స్త్రీలకు చైతన్యమిచ్చే కవితల్ని ఈ సంపుటంతా పరిచారు. స్త్రీ పురుషులు ఏలాంటి ఆధిపత్య ధోరణి లేకుండా పరస్పర అవగాహనతో సహాకారంతో బ్రతకాలనే ఆశను కవయిత్రి"మొగలిపువ్వు-నందివర్దనం"-అనే కవితలో వ్యక్తం చేశారు.ఇదొక కవితాత్మక కథనంగా శిలాలోలిత గారు మలిచారు.'నందివర్ధనంతెల్లటి నవ్వుతోనూ/మొగలిపువ్వు పరిమళ భరితంగానూ/మన ముందుండే రోజు కోసం సప్నిద్దాం"-అని అనటంలో కవయిత్రి కి గల సామరస్య దృక్ఫధం ద్యోతకం అవుతుంది.ఈనాటికీ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు.రోజురోజుకీ ఆ అత్యాచారాలకీ మరో కొత్త పుటలు తెరుచుకొంటున్నయి.అందుకే కవయుత్రి "నిజంగానిజమే/ఆమె నిప్పు కనికెల చర్మాన్ని చుట్టుకొని మండుతున్నట్లుంది"అని చేలరేగుతున్న సంఘర్షణల నడుమ మిణుకు మిణుకు మంటున్నాచైతన్యం గల స్త్రీ "సమానత్వపు బావుటాను ధరించి/ బ్రతుకు ఉలితోతననుతాను చేక్కుకొంటున్న శిల్పి/కొత్తపటంతో కొంగొత్త స్వేచ్చ తో /సగర్వంగా నిలబడిన శిఖరం"-అని కవయిత్రీ ఆమెను తీర్చిదిద్దింది. అతడు-ఆమె ల మద్య గల వ్యత్యాసాన్ని అతి తేలిక మాటలతో మాటలపొదుపుతో వొక గొప్ప శిల్పాన్ని కవయిత్రి సాదించింది" అనగనగా ఒక ఇల్లు"-అనే కవితలో.అతడు/ప్యాంటు తొడుక్కునివెళ్తాడు/ఆమే ఇంటిని కూడా తొడుక్కొని వెళ్తుంది'.ఈ వొక్క వాక్యంలోనే ఉద్యోగిని సాదకబాధకాలన్ని ఈ కవయిత్రి పాఠకులకు స్ఫురణకు తెస్తుంది".ఆర్థిక సంబంధాలే జీవితాన్ని నిర్దేశిస్తే ఆమె కూడా సాటి మనిషేనన్న ఇంగిత ఙానంకొరవడితే ఏమవుతుందో శిలాలోలిత గారు సైన్స్ తో కవిత్వాన్ని అనుసంధానించి "కాంతి+కాంతి= చీకటి అనే కవితలో చమత్కారంగా చెప్పినా ఈ కవిత స్త్రీల జీవితాల్లొని చీకటి చారికల్ని బయట పెడుతుంది. ఈ కవయిత్రి స్త్రీ వాదాన్ని తన కవిత్వంలో ఏంత కొనసాగించినా తాను నివసించిన సమాజంలో ప్రంచీకరణ,మతోన్మాద తీవ్రవాదం,తెలంగాణా ఉద్యమం,అమెరికా మానసంబం ధాలాలోని అవకతవకలు,హైద్రాబాద్ లోని బాంబ్ పేలుళ్లు,సన్నిహితుల మరణం ఇలాంటివన్ని కొన్ని శిలాలోలిత కలంలోంచి కవిత్వమై ఆమెనొక ఉత్తమ కవయిత్రి గా నిలబెడాతాయి.వాదాలా కళ్ళజోడు లేకుండా చూసినా వాటిని అమె కవితగా చేసిన శిల్ప నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా వుండలేం.మతోన్మాదాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ నా మతం అనగలిగే ధైర్యం ఆమెది."దుఃఖం అన్ని మతాలకు సమానమే నంటూ మీ అమ్మ మా అమ్మ వొకే దుఃఖంతో విలపిస్తున్నారు-అని నిర్మోహమాటంగా అన గలిగింది.హృదయాన్ని కరగించే కదిలించే పదాల పేర్పు ఈమె సొంతం. "దుఃఖం గుండేను కావలించుక కూర్చుంది"-అని దిగాలుగా అన్న ప్రపంచీకరణ వేయి నాల్కల పడగల్ని దర్శిస్తూ స్త్రీలందరీ తరపున వకాల్తా పుచ్చుకొన్న న్యాయవాదిని నేను"-అంటూ ప్రపంచీకరణ ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది ఆమె.జరిగినా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆమెను ఆ వైపుగా ఆలోచింపచేయించి కవిత్వమయ్యాయి. మరణం గురించిన చింతన ఎందరో చేశారు.ఈ కవయిత్రి కూడా తన దైన తాత్విక చింతన మరణాన్ని గురించి ఈ సంపుటిలో చేసింది.బైరాగి కవి మరణాన్ని ఇలా వ్యాఖ్యానిస్తాడు."ఏమంటే ఏదీ చావదు ఇచట/ద్రవ్యం లోంచి రూపంలోకి/రూపంలోంచి భావంలోకి/బీజం లోంచి భావంలోకి/ రూపం మారుతున్నది ఒకే శక్తి/రాలుటాకుసెజ్జె లోంచి క్రోంజిగురులు లేచినట్లు"-ఇందు లోని తాత్వికతా ఒకలా వుంటే మహాశూన్యం లో కవి మరో రకంగా'ప్రభువు వద్దకు పరుగెత్తున్నాను / దారిలో మృత్యువు కలిసింది/వణికిపోయాను/చావంటే భయంతో కాదు/బ్రతుకంటే యిష్టంతో/ ఎంతిష్టమంటే చావును చంపి బ్రతకాలన్నంత ఇష్టం" అని చింతన చేస్తాడు.గాజునది లో శిలాలోలిత తనదైన ధోరణిలో మరణాన్ని వ్యాఖ్యానించింది."మనం కూడా అనుకుంటాం/చొక్కా తొడుక్కున్నంతా తేలిగ్గా/బతికేయేచ్చనుకుంటాం/ ఈశరీరం శాశ్వతమనుకుంటాం/రోజులన్నీ మనవేననుకుంటాం " అని ఆమె తేలికగానే అన్న ఆ మాటల్లో ఏంతోబరువుధ్వనిస్తుంది.జీవితచలనసూత్రాలుఈమెకీబాగాతెలుసు."మనుషులంతాఇలావెళ్ళిపోతున్నారేమిటిమొన్నున్నారు./నిన్నున్నారు/నేడున్నారనుకుంటేలేరు"అంటూ తన తాత్వికతను వెళ్ళడిస్తుంది. హైద్రాబాద్ పేళ్ళులను,సునామీ విషాదాన్ని ఈమె కవిత్వ వేణువు ఏంత బరువెక్కిన దుఃఖంతో పలికించిందో,అంతే స్వరలేపనంతో చౌరాసియా గాన మాధుర్యాన్నీ రాగాలబాణాలను సంధిస్తూ స్వర ఝరులను వూదుతుంది. నాన్న గురించి కవిత "కన్నీటి చెలిమలో నాన్నా"అనే కవిత"కారు అద్దంపై ఎంత తుడుస్తున్న తడిసే వర్షపు చుక్కలా"మన గుండెల్ని తడుపుతుంది.మనిషే నిలిచే వెలుగు రవ్వ-అని అనే కవిత ఐదుపొరలు ఈ సంపుటిలో కవయిత్రి శిల్ప వైవిధ్యానికి తార్కాణం.శిలాలోలిత గార్నికవిత్వం కొనసాగించమని... కోరుతున్నాను.ఆరోగ్యం సహకరించక పోవటం వల్లా ఈ వారం కొత్త సంపుటిని పరిచయం చేయలేక పోతున్నందుకు కవి మిత్రుల్నీ అన్యథా భావించవద్దని కోరుతున్నాను.కొందరి మిత్రుల కోరిక కారణంగా" శిలాలోలిత" గారి "గాజు నది" సంపుటి పరిచయాన్ని మరోసారి మీకు పరిచయం చేస్తూ వచ్చే వారం మన మిత్రుల కొత్త కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flIQ8U

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి