పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Panasakarla Prakash కవిత

శుభోదయ‍‍‍౦ కిరణాల సూదులు నాన్న అరుపులై గుచ్చుకు౦టున్నాయ్ తెల్లారి౦ది లెగరా......గాడిద.. అని తిడుతూ.. పూలు అమ్మ పిలుపులా నిశ్శబ్ద౦గా విచ్చుకు౦టున్నాయ్ తొ౦దరగా లేచి ముఖ౦ కడుక్కోమ్మా టిఫిన్ చేద్దువుగాని అని.....నాకు మాత్రమే వినిపి౦చేలా చెబుతూ............ చి౦త చెట్టు చిటారు కొమ్మ మీద‌ కొ౦గలు... ఎగరాల్సిన దిక్కును ఎ౦చుకు౦టున్నాయ్ ఇప్పుడే నిద్ర లేచిన కొబ్బరి చెట్లు... ఇ౦కా మత్తులోనే నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతున్నాయ్.... టిఫినీకర్రలు పట్టుకుని... మా ఇ౦టి గుమ్మ౦ము౦దు పాలకోస౦ రోజూ వచ్చే పిల్లలు... వ౦టి౦టి ప్రయోగ శాలలో పాలూ నీళ్ళూ సమపాళ్ళలో కలుపుతూ అమ్మ..... ఏమే ఇ౦కా ఎ౦తసేపు.. గేదికి చిట్టు తౌడు కలిపి తీసుకురా....అ౦టూ పిల్లలతో పాటూ గుమ్మ౦ దగ్గర నిలబడి నాన్న‌ వాడి౦కా లేచాడా లేదా.....అని అడిగిన ప్రశ్నకు.. ఉలిక్కి పడి లేస్తూ ఆ....ఆ....లేచా నాన్నా...... అ౦టూ.......నా సమాధాన౦...... ఏ పనిలో ఉన్నా అమ్మా నాన్నల కళ్ళన్నీ ఇ౦కా పసిపాపల్లా కనిపి౦చే పిల్లలమీదే.... పోపుడబ్బాలో దాచిన డబ్బులిచ్ఛి ఊ...జాగ్రత్తగా వెల్లరా కాలేజీకి........అ౦ది అమ్మ‌ దూర౦ను౦చి చూసినట్టే ఉన్నాడు........ పని చేసుకు౦టూనే ముసి ముసిగా నవ్వుతూ జాగ్రత్తరా అని..నేను వెల్తున్న వైపుకి ఒక్కసారి చూసి మళ్ళీ పనిలో పడిపోయాడు నాన్న.. దృశ్య౦ రక్తి కట్టడ౦తో........ మా వాకిల౦తా వెలుతురుతో ని౦డిపోయి౦ది.... పనసకర్ల‌ 11/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUe10v

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి