పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఆ జ్ఞాని ఏడి? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ సరస్వతి బ్రహ్మలోకం దిగి వచ్చి ప్రేక్షకురాలై ఆసీనురాలవుతుందో ఆ జ్ఞాని ఏడి అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ సప్తర్షులు సైతం దిగి వచ్చి ప్రేక్షకపాత్ర వహిస్తారో ఆ జ్ఞాని ఏడి అగుపించడేం! ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ దిక్పాలకులు వచ్చి చుట్టూ కాపలా కాస్తారో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ విశ్వజ్ఞానులు వచ్చి ఆ సభని అలంకరిస్తారో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం! ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే భూమాత తన బిడ్డలతో సైతం వచ్చి ఆ సభలో కూర్చుంటుందో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే అక్షరాలు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే పద్యాలు పరవశిస్తాయో పరిమళిస్తాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ప్రశ్నలు దాసోహం అంటాయో బిక్కమొహం వేస్తాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే జ్ఞానవిజ్ఞానాలు అతనికి కిరీటాలవుతాయో అతని ప్రతిభకి పట్టం కడతాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఓ జ్ఞానీ! ఏమైపోయావ్? నక్షత్రమండలం చేరి కనుమరుగైపోయావా? లేక ఆజ్ఞానాంధకారంలోకి చేరి అఖాతంలోకి కూలిపోయావా? ఏమైపోయావ్? నీ అదృశ్యంతో ఎంతమందిని నిరుత్శాహపరిచావ్! నీ కోసం నీ జ్ఞానదానం కోసం దాహంతో ఎదురుచూసే మాకు ఎంత నిరాశ మిగిల్చావ్! 15మార్చి20104

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj2yYF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి