పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Vijaykumar Amancha కవిత

తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే తెలుగుబాస మరుస్తారా? తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా? తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపొతుందా? తెలంగాణ వేరైతే చెలిమి తుట్టి పడుతుందా? తెలంగాణ వేరైతే చెలిమి లెండిపొతాయా? కులము తగ్గిపొతుందా బలము సన్నగిలుతుందా పండించి వరికర్రల గింజ రాలనంటుందా? రూపాయికి పైసాలు నూరు కాకపొతాయా? కొర్టు అమలు అధికారము ఐ.పి.సి. మారుతుందా? పాకాల, లఖ్నవరం పారుదలలు ఆగుతాయా? గండిపేటకేమైనా గండితుటు పడుతుందా? ప్రాజెక్టులు కట్టుకున్న నీరు ఆగనంటుందా? పొచంపాడు వెలసి కూడ పొలము లెండిపొతాయా? తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? –కాళోజీ

by Vijaykumar Amanchafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7Avtc

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి