పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

అనామకంగా..... మౌనమొకటేనా సమాధానం చిత్రితరూపసందోహాల స్వప్నావిష్కరణలు మౌనమే భూమ్యాకాశాల మధ్య ఈదులాడుతున్న పురాక్రుత జీవావశేషాలిప్పటికీ మౌనమే భాషకందని భావావేదనల సంక్షుభిత సంకలనాలన్నీ మౌనమే అలా గాలిలో తేలాడుతు రెక్కలతో రంగులువిసిరే సీతాకోకచిలుకలది మౌనమే మాటలన్ని కాలిపోయాక బూడిదైన ఇష్టాలు రహస్యధూమాలై మౌనమే పలకరింపుల పక్షులు తడిసిన ఈకలతో అందరి కళ్ళు తుడిచినంత సేపు మౌనమే నిద్రిస్తున్న అగ్నిపర్వతం వంటి మనసు మేల్కొంటున్నది భూమంతటా పరచుకున్న తెల్లనిచెట్లవేర్లలా నా తలపులు గుండెల్లోకి దిగిపోయాయి కాసేపు విశ్రమించని అలల్లా కొట్టుకుంటున్న వూపిరి మునుం సాగుతున్నది దయా దాక్షిణ్యాలు లేని చీకటిరాత్రుల వైకల్పిక కల్పనా విలయతాండవాల విక్రుతాలు రేపటి లేతచిగుళ్ళకు ఆశల హరితవర్ణాలు అద్దుతున్న మనసు మీద కల్లోలాల ఆసిడ్ దాడి పాదాలు, నేల నెర్రెలుబారి ఎడారులవుతున్న వేసవిబాటల్లో ఒంటరిగా నడుస్తున్న పొద్దు మౌనంగానే, ఎందుకీ మౌనం? కాలం కాలమంతా వసంతోత్సవమై గాలంటే ప్రేమతుషారాల స్పర్శగా రాగాలు తీసే నదులన్నింటిని తీగెలుగా మీటి పాడుతున్న పాటనెక్కి మోయు తుమ్మెదల వాగువెంట ప్రవహించి పోవాలి కాని మౌనమెందుకు ముట్టుకుంటేనే వేలపూలరేకులుగా విరబూసే తోటలో వెన్నెలచెట్లనీడలో పెదవులు కదలగానే మెదిలిన తలపులన్నీ రాసుకున్న కావ్యాలై పోవాలిగాని మౌనమెందుకు వాగ్దానాలడుగను కాని, వాగ్దత్తమై పోయి నలిగిపోకు చెప్పమని కోరను కాని రహస్యమై కుమిలిపోకు 16.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83KHy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి