పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Rajasekhar Gudibandi కవిత

రాజశేఖర్ గుదిబండి (చంద్రం) || నేను ప్రవహిస్తానెప్పుడో... || నేనో బొట్టుని ! బ్రతుకు బాటలో వ్యధల మూటతో కృశించిన నశించిన బాటసారి గుండె కవాటాల శబ్ద నిశ్శబ్దాల మధ్య ఠప్పున జారిపడ్డ నెత్తుటి బొట్టుని ! చీకటి రక్కసి కబళించిన అబల కడుపు చించుకొని జన్మనిచ్చిన అనాధ బిడ్డ బొడ్డు కోసి రాల్చిన తొలి నెత్తుటి బొట్టుని ! ధనిక పేద వ్యత్యాసానికి కుల మతాల దౌర్జన్యానికి తాళ లేక వేసారిన ప్రేమ జంట కళ్లల్లో చిందిన కన్నీటి బొట్టుని ! రోజంతా ఒళ్లిరిచి గానుగలో ఎద్దులాగా రెక్కలేమో ముక్కలైన చివరికేమో పీనుగైన సగటు మనిషి పుడమిని తడిపే చెమట బొట్టుని ! నేను ప్రవహిస్తానెప్పుడో ** ** ** మీ దౌర్జన్యాలు , కులమత రాజకీయాలు, లైంగిక నిర్బంధాలు మీ అవినీతి , అమానవీయ అసమానతలు , మీ కుళ్ళు , కాఠిన్యం ఇంకా ఎన్నో ఎన్నెన్నో తుడిచేయడానికి, కడిగేయడానికి నేను ప్రవహిస్తానెప్పుడో హిమ శిఖరాలు కరిగి కన్నీరైనట్లు దిగంతాల స్వేదం మేఖాలై జలపాతాలై చిందిన రుధిరం చెలమలై ,సేలయేళ్ళై, ఉప్పెనై ప్రవహించినట్లు నేను ప్రవహిస్తానెప్పుడో ఉరుమై , మెరుపై , ఉత్తుంగ తరంగమై, కోటి కలల అలలనై ప్రవాహమే దేహమై దేహం ప్రవాహమై నేను ప్రవహిస్తానెప్పుడో.... || రాసింది 04.03.1988 || మొదటిసారి ప్రదర్శింది || 16/03/2014 ||

by Rajasekhar Gudibandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQsicl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి