పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || నిత్య హోళీ || తెలిమంచుతెరల్లొ నీ ఎదను తాకిన అరుణార్ణవం వర్ణరంజితమై ఇంద్రధనువుకే మెరుగుపెట్టే శతకోటి వర్ణాలు.. నీ మేనికాంతుల్లో ! ఎడారిలో మండే ఇసుకరేణువులకు రంగుల ఆస్వాదనని పరిచయించింది నీలోని పరమాణువుల స్పర్శకి పచ్చికనేలపై జీవంకోల్పోయే గడ్డిపరకపై నీ చెమటచినుకులు జారి సంజీవినిలా ప్రాణం పోసాయి ! గుప్పిట పట్టిన సగంవాడిన సుమాలు నీ హస్తరేఖల్ని కౌగిలించుకుని ఊపిరి పీల్చుకున్నాయి సంతోషంగా ! చీకటి ఎదపై నీ కురుల లాస్యాలు వెన్నెల పొదరిల్లే కట్టింది చంద్రుని భువిపై దింపింది ! నీ నిశ్వాసలు పీల్చి గాలిలోని దుమ్ముకణాలు ప్రకాశవంతమై ప్రకృతికి కాంతిలహరి అందించింది నిస్సారమైన మట్టిలోని పొరపొరకీ రంగుల అద్దకాలే... నీ పాదస్పర్శతో వెలువడే ఆత్మీయకిరణాల పలకరింపుతో విశ్వమంతా రంగులకేళీయే !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvljI5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి