పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/అర్థాల వసారా ::::::::::::::::::::­:::::::::::::::::: పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే ఎప్పుడూ పాత నీడలే మునుపెన్నడో నేశాను అంతరంగ పరికిణీని ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు ఎండిపోయిన పూల సుగంధంలా నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటాను కాస్తంత ఖాళీ ఉంచమని నేనొచ్చేదాకా మనసు గుహల్లో ఎన్ని శవాలో ప్రతి నిత్యం కాలుతుంటాయి నిర్వేదానికి ఒత్తాసులా చెక్క తలుపుల మధ్యన ఓ నిండు సువాసన తెరచిమూసినప్పుడల్లా వసారాలో ఒంటరి ధూలాలు చెదలతో రమిస్తూ వర్షం పలకరించినపుడల్లా ఒళ్ళుతడుపుకుంటూ కొంత మట్టివాసనను లోలోపలకు తోడుకుంటూ మరికొన్ని అక్షరాలు నగ్నంగా నానాలి కొత్త అణువుల శోధనలో తిలక్ బొమ్మరాజు 05.04.14 20.04.14 వాకిలిలో ప్రచురినుయిన నా కవిత http://ift.tt/1hUwxBk

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUwxBk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి