పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవితలు: 1. ....|| గులాబి ॥.... గులాబి గుండెలోని గుప్త నిధి నీ ఎద సంపదే. వెదజల్లు దాన్ని రోజా లా అంతే, నీ బాధ ఆమె స్వంత బాధై పోతుంది . ఒక పాటలోనో ఒక మహా ప్రణయాభీష్టం లోనో చల్లు ఆ నిధిని. ఆపకు ఆ గులాబీని ఆపావా , ఆ అగ్నిలో నీవు ఆహుతి. ( ఆదివారం ఆంధ్రప్రభ Dt:13.04.2014లో ప్రచురితం) 2. ....॥మలిసంజ ॥.... నా హృదయం మైనమౌతున్నది మెత్తగా ,కరిగే కొవ్వత్తిలా . నా రక్త నాళాలు చిక్కని తైలాలు ద్రాక్షాసవ ప్రవాహాలు కావు . అణచబడిన నా మెతక బ్రతుకు పారిపోతున్నది గజెల్లా జింకలా. 3. ....||పరంజ్యోతి ॥.... వృధాగా యత్నిస్తున్నావు నా పాట పీక నొక్కాలని లక్షలాది పిల్లలు నా పాటను ఏక కంఠం తో పాడుతున్నారు కోరుస్ గా సూర్యుని కింద. వృధాగా శ్రమిస్తున్నావు నా గీతాన్ని విరిచెయ్యాలని: ఎంతో ఆర్తి తో పాడుతున్నారు పిల్లలు దేవుని చెంత. ('సూర్యుడు' భగవంతునికి, 'పిల్లలు' తన అభిమానులకు ప్రతీకలు) (ఆదివారం ఆంధ్రప్రభ Dt:20.04.2014 ) మూలం :గాబ్రియేలా మిస్ట్రాల్ (చిలీ దేశ నోబెల్ లారియెట్ ) . తెలుగు సేత : నాగరాజు రామస్వామి. ---Dt: 01 .05.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHgJOj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి