పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

Afsar Afsar కవిత

టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ". టెక్సాస్ పొయెట్ లారెట్ అనే గౌరవం ఇప్పటిదాకా పురుషులకే సొంతం. మొట్టమొదటి సారిగా ఈ గౌరవాన్ని గెల్చుకోవడం అంటే కార్లాకే కాదు, అమెరికన్ కవిత్వ చరిత్రలో స్త్రీలు ఎగరేసిన విజయ కేతనం. బ్రెస్ట్ కాన్సర్ తో రోజూ మరణంతో తలపడుతున్న కార్లా కవిత్వాన్ని వొక హీలింగ్ తెరపి అంటుంది. “రోజూ కవిత్వంతో మళ్ళీ మళ్ళీ బతుకుతూ వుంటాను. పదాలు ఎవరికేం చేస్తాయో నాకు తెలీదు కాని, నా మటుకు నాకు అవి థెరపీ. నాలోపల వొక ఉద్వేగాన్ని పదాలు బతికిస్తాయి. ఆ ఉద్వేగాన్ని మీలోనూ బతికిస్తే నా కవిత్వం గెల్చినట్టే!” అంటుంది కార్లా. కాన్సర్ రాక ముందు కార్లా కి అందమైన జుత్తు వుండేది. కాన్సర్ వల్ల గుండు గీయించుకోవాల్సి వచ్చింది. ఈ కవిత ఆమె అందమైన జుత్తుకి వీడ్కోలు. ~ గాలికి చేతులున్నాయని నాకు తెలీదు, నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా . నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా. ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని, మరణమా! నీ దాకా వచ్చే దాకా! నీ నిశ్శబ్దపు చూపు కింద నగ్నంగా వికలంగా నిల్చునే దాకా. మూలం: కార్లా కె. మోర్టాన్.

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4KYIJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి