పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

సిరి వడ్డే కవిత

ll నా లచ్చి జాడ...మీరైనా సెప్పరూ ? ll సుక్కవై నను సేరావు సప్పున నా మనసే దోసావు ఏడని ఎతకనే లచ్చీ ఇన్నిఏల సుక్కల్లో నిను ఎన్నెలై అగుపించి దోబూసులాడకే జాబిలివై మురిపించి మబ్బుల సాటున దాగకే సిరుగాలై నను తాకావు సెలయేరై సేదతీర్సావు ఏ మంచు దిబ్బలనడగను ఆ సల్లదనం ఏదని ? "కొమ్మ" వై నను ఊహల ఊయలలే ఊపావు ముద్దు గుమ్మవై అందాల ఇందులే సేసావు ఏ కొమ్మన వాలి మురిపిత్తున్నావో కోయిల పాటలతో జతకలిపి పూలగంధమై పరిమలించావు ఏ పూదోట దాగినావో మాటల మదువులతో మామను మురిపించి మాయసేసి నను నీనీడగా దాసేసావు నను ఇడిసి పోనని బాసలే సేసి ఏడ దాగున్నావో ఆదమరసి ఏటిగట్టుకు సానమాడ బోతినంటివే పిత్తపరిగలు బేరమాడి తెత్తనంటివే ఏటిలోని సేప పిల్లనడిగా కొలనులోని కలువబామనడిగా గూటిలోని గువ్వపిల్లనారా తీసినా నిండు సందురున్ని సైతం నిలదీసినా జాజి మల్లెలన్ని అలిగిపోయే మాలల్లలేదేమని పొదరిల్లు బోసిపోయే దీపమెట్టలేదని పోయ్యిలోన పిల్లికూన ముడుసుకున్నదే కాలమేమో పగపట్టి కదలకున్నదే సెలఏరులన్నీ నీ నవ్వుల గలగలనే తలపిత్తన్నాయే కూనలమ్మలన్ని నీ పలుకుల తేనియలనే ఊరిత్తన్నాయే పూవులన్నీ నీ మనస్సులోని మమతలతో మురిపిత్తన్నాయే పైరు గాలి నీ యెదసొదలనే ఇనిపిత్తన్నాయే గువ్వలనడిగితే గుసగుస లాడుకుంటున్నాయే మల్లెలనడిగితే మత్తుగా సొమ్మసిల్లిపోతున్నాయే కొండలనడిగితే కరగనైనా కరగవే కోనలమ్మలైనా బదులీయకున్నవే నిను ఇడిసి నేనుండలేనే ఏడేడు జన్మల తోడై నాతో నడిసి రావే మావ మదిలో కొలువుండి పోవే మావ కంటి ముత్యమై గుండెలో దాగుండిపోవే ll సిరి వడ్డే ll 01-05-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fvfuY1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి