పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

వీలునామా అమ్మా... శరీరం మీద తెల్లవారని కాళరాత్రులని భరిస్తున్నట్లు ..మీరు గుందెల్లో అంటుకున్న చితితో బరువుగా...బాధగా.... చావు శ్వాస పీలుస్తుంటారు. మున్నూట అరవై రొజులూ పస్తులున్నాక ఒక్కరొజు ..విందు భొజనం పేరుతో సజీవంగా తద్దినం పెట్టి .... స్వాతంత్ర్యాన్ని ..నిశ్శబ్దంగా ముక్కలుగా నరికి,రక్త మాంసాల్ని ..మందులో నంజుకుంటున్న ఈ దెశం లో కన్నతల్లి చనుబాలు నా కందకుండానే దొపిడీ చెసి....మూతి తూడ్చుకునే ఈ క్రూరాబందుల రాజ్యం లో ఓటు నోటుకు పక్క వేస్తుంది. ఆనొటు మీ శీలం మీద పది దొర్లుతుంది …. అమ్మా ..నాకు తెలుసు మీరు కార్చిన కన్నీళ్ళే మూడు వైపులా ఈ ద్వీప కల్పం చుట్టూ సాగరాలై రోదిస్తున్నాయని.. ప్రజలు కార్చిన కన్నీళ్ళే ..జీవనదులై మీ అస్రు జలధిలో సంగమిస్తున్నాయని .. ఎం చెయ్యను ...చెప్పండి. .. పుట్టుకతో కర్మ సిద్ధాంతాన్ని కల్తీ సంస్కుతిని ..తిని పెరిగిన అంట్ల వెధవాఇని మాత్రు భూమి పీక మీదుగా అశోకుని ధర్మచక్రం ..నదిచి వెల్తున్నా వేదాంతం మాట్లడే ...తిరుగుబాటు తెలియని బానిసలకు పుట్టిన ...పుట్టు వారస బానిసుణ్ణి ఏమెచెయ్యకుండా అన్నీ చెస్తున్నాననే భ్రమా పూరిత ప్రభుత్వంలో.. ప్రజలని..వెంటాడి..వెంటాడి వేధించి..వేధించి.. దొంగ దెబ్బలు కొట్టే రాజ్య పాలనలో.. గుండె నిండా ..ఆసని గుర్రపు డెక్కలా పాతుకొని ... మింగ మెతుకు లేకున్నా .. సంపెంగాలొచనలతొ బ్రతుకుతూ ఇన్నాళ్ళూ నా యవ్వనాన్ని వ్రుధాగా పారబోసాను ,...... ఇప్పుడలాకాదు.. అమ్మా.. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టును మీ అరి చెతుల్లొ గొరింట్తాకుగా ..దిద్దేందుకు .. నా తనువులోని అణువణువును.. ఒక్కొ ..మేకుగా చేసి .. ఈ దుష్ట వ్యవస్థను ..పట్ట పగలు శిలువవెసి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా .. ఎవరెస్ట్ మీద ప్రతిష్టిస్తాను ... ప్రతి మనిషి గుండెల్లో అంతుకున్న అదవి గెరిల్లానై దాక్కోని తూర్పు దిక్కుకు వంతెనగా నిలుస్తాను….. .అమ్మా..ముప్ఫై ఆరెల్ల ఈ అస్ట వక్రచరిత్రను త్రివిక్రముణ్ణై ... పాతాళానికి తొక్కెందుకు అసాంతి జీవుల తలల్లో తొలికొడై కూస్తున్న నా ఈ కలం తో ఈ భ్రష్తున్నర .. భ్రష్తు వ్యవస్థకి.. పాడె కట్టి రాస్తున్నా తుట్ట తుదకు ఈ వీలునామా …………………. 1983 డిసెంబర్ 5 ఆ ప్రాంతంలో ఆరొజుల్ని చూసి రాసిన ఈ కవితని.. .. ఇప్పటి రోజులకి అన్వైంచుకుంటే ఎలా వుందో మీరే చెప్పాలి అశ్రువు ............సమతా రచైతల సంఘం బహుమతి పొందిన కవితా సంపుటిలొంచి

by కొనకంచి లక్ష్మి నరసింహా రావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R2zGVU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి