పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || నేడే మేడే || ============================ మట్టి చేతులన్ని వట్టిపోతున్నాయి గట్టి చేతులన్ని మట్టి కొడుతున్నాయి కాలే కడుపులన్ని ఆకలి కేకలు పెడుతున్నాయి పేగుల్లో ఎన్నో ఆకలి బాధలు వేదనలు చెప్తున్నాయి గాయాలన్నీ పునరావృతమవుతున్నాయి రసి కారే జ్ఞాపకాలన్నీ మళ్లీ తరుముకొస్తున్నాయి స్వేదం చిందించే జీవితాలన్నీ కరుడుగడుతున్నాయి దోపిడీ వర్గ దారుల్లో కార్పోరేట్ షోకులన్ని పడగ విప్పుతున్నాయి దేహాలును తాకట్టు పెట్టి దేశాలు పరిగెడుతున్నాయి కూడు నీడ లేని జీవితాలును తాకట్టుగా మార్చి ప్రపంచ బ్యాంకు అప్పుకు తలరాతలు రాసి తలసరి ఆదాయం చూపించి,ప్రతీ తలకాయకు అప్పు తెచ్చి పబ్బం గడుపుకునే నీ సామ్రాజ్యం అదురుతుందెక్కడో ! మండే గుండె రగిలిపోతుంది రగిలే గుండె మండిపోతుంది పగిలిన గుండె తరుక్కుపోతుంది బిరుసెక్కిన శరీరం వేడెక్కి పోతుంది ఆకాశం లో మేఘాలన్నీ ఎర్రగా మారిపోయాయి బహుశా దేశాంతరాలు వీడి వస్తున్నాయి కాబోలు ఎరుపెక్కిన మేఘాలు భానుడినే బెదిరిస్తున్నాయి కదం తొక్కే శ్రామిక లోకం ఉక్కు పిడికిలి బిగించింది మేడే సాక్షిగా గత పోరాటాలకు ఎర్ర జెండా ఎగుర వేసింది కార్మిక లోకం ఐక్యత ఎర్రగా విప్లవాన్ని విరబూసింది ఉద్యమాల ఊపిరి కదం తొక్కింది. గుడిసెలను చూసి అద్దాల మేడలు అదిరి పడుతున్నాయి విప్లవ జ్వాలల ఛాయలకు బెదిరిపడుతున్నాయి అంతా చీకటే ! ఆకాశం లో ఒక చిన్న మెరుపు ఎర్రగా ! గగన వీధుల్లో సైతం ఎర్ర జెండా చిహ్నాలు మెరుస్తున్నాయి కళ్ళన్నీ ఎరుపెక్కాయి ... ఎర్రటి దారులు పరిచాయి రక్తం తడిచిన చొక్కాలు ఎర్ర జెండాలై లాల్ సలాం ... అంటూ రెప రెప లాడుతున్నాయి ============ మే డే /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKwnQK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి