పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Pardhasaradhi Vutukuru కవిత

!! ఒంటరి పోరాటం !! అందరు వున్నా ఒంటరి బ్రతుకు కొందరిది ప్రతిదానికి సున్నితం గా స్పందించే జీవితాలకు భరించ వలసిన భర్త బాధ్యతా రాహిత్యం తో వుంటే ఇంటికి తానె మగడై బజారు కు వెళితే ప్రతి వాడు పలకరించే వాడే ప్రేమ కురిపించే వాడే ఆత్మాభిమానం తో వుండే అతివ అణిగి మణిగి వుంటే చేతకాని తనమని భావించే జనం ఇంకా చేతికి అంది రాని పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం మృగాలతో పోరాటం పుట్టింటికి వెళ్ళాలంటే స్వాభిమానం ప్రతి చూపు , ప్రతి పలకరింపు ఆకలివే సమాజం కోసం నవ్వుతు స్వగతం లో కుళ్లి కుళ్ళి ఏడుస్తూ చస్తూ బ్రతుకుతూ ... తనకోసం బ్రతకలేక కుటుంబం కోసం చావలేక ఎందుకీ బ్రతుకు అనే వేదన ఆకలి గొన్న అడవి మృగాల కైనా జాలి ఉందేమో కాని ఈ మానవ మృగాల మధ్య సామాన్య వనిత మన గలదా కుటుంబం నాది అనుకోవటం శాపమా ఒంటరి పోరాటం చేయాటం పాపమా .... పుణ్యభూమి నాదేశం నమో నమామి !!పార్ధ !!22/05/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWX2FC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి