పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Srinivasu Gaddapati కవిత

ఏమో గుర్రం ఎగురా వచ్చు ---------------------- /శ్రీనివాసు గద్దపాటి/ ఏమో ఇండియా వెలిగిపోతుందేమో...!? పడమటిగాలిమోజులో వలసబోయిన పక్షిపిల్లలు మళ్ళీ గూటికి చేరుతాయేమో..! బక్కచిక్కిన రూపాయికాస్తా బరువెక్కుతుందేమో వరాలజల్లుకు మోసపోయి ఆశలవిత్తులుజల్లుకున్నాక రుతుపవనం కాస్తా తీరం దాటకుంటేనో...!? ఏమో....! ఇండియా వెలిగిపోతుందేమో.... స్కామ్ లో... స్కీమ్ లో.... తేడాతెలియని జనాలు మోడీలను త్రీడీలలో చూసి మోసపోతున్నంత కాలం ఏమో.... ఏనుగు దుముకావచ్చు... గుర్రం ఎగురావచ్చు 22.05.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nuQpvj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి