పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Afsar Afsar కవిత

కవిత్వంతో కరచాలనం-8 ~ వలస వెళ్ళిన వాక్యం ~ ఆమె రాసుకున్న వాక్యాలే ఆమెని వెంటాడాయి, తన దేశం దాటే దాకా! తనవాళ్ళకి దూరంగా దేశం కాని దేశంలో ఆమెని ప్రవాసంలో బతికేలా చేశాయి. అయినా, ఆమె గొంతు విప్పి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే వుంది, చివరి దాకా- మొన్న ఏప్రిల్ 14న న్యూ యార్క్ లో తొంభై ఏళ్ల వయసులో కన్ను మూసే దాకా! చనిపోయే దాకా పుట్టిన దేశం వెళ్ళాలని, తన వాళ్ళని చూసుకోవాలని ఆమె కల చూస్తూనే వుంది. ఆ వొక్క కల మాత్రం నిజం కాలేదు. కాని, ఆమె రాయాలనుకున్న వాక్యాలన్నీ రాసి కన్ను మూసింది. ఏ భాషలో రాస్తున్నామో ఆ భాష మాట్లాడే జనం మధ్య లేకపోవడం కన్నా ఇంకో నరకం లేదని ఆమె వొక సందర్భంలో చెప్పుకుంది. ఆమె పేరు - నీనా కాసియాన్. కవుల జీవితాలు ఎంత దుర్భరమో, అందునా వొక స్త్రీగా పుట్టడం వల్ల అది ఇంకా ఎంత దుర్భరం అవుతుందో నీనా జీవితం వొక ఉదాహరణ. రష్యన్ రచయితల పేర్లు విని ఎన్నాళ్ళయింది మనం?! పోనీ, కవుల్లో మాయకోవస్కీ తరవాత విన్న పేరు..! గుర్తుకు రావడం కష్టమే! ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం నీనా కాసియాన్ జీవితంలో వుంది. నీనా 1924 లో పుట్టింది. ఆమెకి పదకొండేళ్ళ వయసులో తన కుటుంబం Bucharest కి వలస వెళ్ళింది. కవిత్వం మీది విపరీతమైన మమకారంతో Bucharest University సాహిత్య విభాగంలో చేరింది. 1947లో ఆమె మొదటి కవిత్వ సంపుటి scale 1:1 అచ్చయింది. అచ్చు కాగానే నీనా మీద సాంస్కృతిక దాడి మొదలైంది. ఆమెని అప్పటి స్టాలిన్ ప్రభుత్వం “పతన” కవుల జాబితాలో చేర్చింది. ఆమె తన కవిత్వంలో అధివాస్తవిక పదచిత్రాలు ఎక్కువగా వాడ్తుందని ఆమె మీద ఆరోపణ. కవిత్వం వాస్తవికతకి దూరంగా వుండకూడదు – అన్న మొండి వాదం చేసి, ఆమె కవితల్లో కొన్నిటిని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన వొక కవిత్వ వాక్యం: వొక సముద్ర వర్ణనలో ఆమె అన్నదట- సముద్రం “yellow in the twilight” అని – “సంధ్య వేళ సముద్రం నీలంగా కనిపించాలి కాని పసుపు పచ్చగా కనిపించడం ఏమిటని?” ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆమె అనేక రకాల సాక్ష్యాలు చూపించిందట. కానీ, వాటిని వేటినీ ప్రభుత్వం వొప్పుకోలేదు. ఆమె మీద, ఆమె కవిత్వం మీదా ప్రభుత్వ పీడన పెరిగిపోయింది. వాటిని తట్టుకోలేక ఆమె అమెరికా పారిపోయింది. 1965లో రుమేనియా సోవియట్ నించి విడిపోయింది. కాని, రుమేనియన్ల కష్టాలు తీరలేదు. స్టాలిన్ ని మరిపించే నియంతలు అక్కడ పుట్టుకొచ్చారు. వొక సారి రుమేనియా అధినేత నికోలాయి సెసేస్క్యూని నీనా కలవాల్సి వచ్చింది. అప్పటికే రుమేనియా ప్రభుత్వం కూడా నీనా కవిత్వం మీద వొక నిఘా కన్ను వేసి ఉంచింది. కాని, నికోలాయి కి నీనా కవిత్వ వివరణలు నచ్చలేదు. ఆ అధినేతని కలిసి వచ్చిన తరవాత ఆమె ఇలా రాసింది: With rational syllables I try to clear up the occult mind And promiscuous violence. My linguistic protests has no power The enemy is illiterate. అంతే, రుమేనియా ప్రభుత్వం కూడా ఆమె మీద విరుచుకుపడింది. ఎంతగా అంటే, ఆమెని ఏమీ చేయలేక – ఆమె అమెరికాలో వుంది కాబట్టి- స్వదేశంలో వున్న ఆమె స్నేహితులందరినీ అరెస్టులు చేసి, జైళ్ళలో పెట్టింది. స్వదేశంలో నీనా పేరెత్తినా సరే, కటకటాలు నోరు తెరిచేవి. కాని, నీనా కవిత్వఖడ్గ ప్రహారం ఆగలేదు. ఆమె ప్రతి కవితా రాజకీయ కవితే! అయితే, అది వచనం కాకుండా జాగ్రత్త పడడం ఆమె విజయం. ఆమె కవితలు రెండు వినండి: A Withered Rose A withered rose is a withered rose is a withered rose. Its head bows in mourning, it sheds pink petals like enormous tears. My head also contemplates the floor where nothing grows. నాకు బాగా నచ్చిన కవిత మాత్రం ఇది: Purity Amazing solitude. Only me and my cigarette, and this tiny dragonfly painted in Moldavian monastery blue. Nothing threatens me, not even the sun. The sky is an immense cloud made of mother-of-pearl. The lake is an immense cloud made of mother-of-pearl. I am the mermaid of the lake. – I am an infinite melody like the murmur of the rain. And I am clean, like the poem I’m writing.

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5ejKg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి