పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Srinivas Yakkala కవిత

***పసిపాప*** పుట్టింది పుట్టింది పసిపాప పువ్వల్లె నవ్వింది పసిపాప మగబిడ్డ కోసమని పసిపాప మొక్కులు మొక్కారె పసిపాప ఆడపిల్లవని పసిపాప ఆడోల్లే ఏడ్చారే పసిపాప బంతి పువ్వులాంటి పసిపాప బడి బాట పట్టింది పసిపాప ఆటలు ఆడింది పసిపాప పాటలు పాడింది పసిపాప అల్లరి చేసింది పసిపాప ఆనందంగ ఎదిగింది పసిపాప పెరిగింది పెరిగింది పసిపాప పెద్దమనిషి అయ్యింది పసిపాప పైట వేసిందమ్మ పసిపాప పనులెన్నొ నేర్చింది పసిపాప అమ్మకు సాయంగ పసిపాప అండగ నిలిచింది పసిపాప… ఇక్కడి నుండి పెద్దవాల్లు పసిపాపని ఏమంటరంటే……. ఫద్దతిగ ఉండని అంటరూ పకపక నవ్వద్దని అంటరూ పరుగులు పెట్టద్దని అంటరూ బయటకి పొవద్దంటారూ చదివింది చాలని అంటారు సంబంధం చుస్తామంటారు….. ఇంకా రాయల్సి ఉంది …….తప్పులుంటే క్షమించండి. శ్రీనివాస్ యక్కల

by Srinivas Yakkala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXjADf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి