పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అభయం ఒంటరిగా ఉన్న నన్ను ఎత్తుకుని బలవంతంగా ప్రకృతి బయటకి తీసుకెళ్లింది విషాదంలో ఉన్న నన్ను పుష్పాలు తమ నవ్వులతో పలకరించి నన్ను నవ్వించాయి మాట్లాడలేని నన్ను పక్షులు తమ కుహూరావాలతో నా నోట్లోనుండి రాగాలు పలికించాయి నడవలేని నా చుట్టూ అందమైన సీతాకోకచిలుకలు చేరి తమ నాట్యాలతో నన్ను ఆకర్షించి తమతో పరుగెత్తించాయి నిరాశలోకూరుకుపోయిన నన్ను ఆకాశం పైకి లేపి నా భుజం మీద తన మృదువైన చేయి వేసి భవిష్యత్తులోకి నడిపించింది ఇప్పుడు నేను ఒంటరిగా లేను నిర్వేదంలో అస్సలు లేను మనసు తేలికై మరో ప్రపంచంలో ఉన్నాను అదే నా ప్రపంచమై దానికి నేనే రాజునై నేనే ఒక నాయకుడినైనట్టు ఎంత అందమైన వాస్తవం ఒకప్పుడు ఈ జీవితం ముగిసిపోతే ఎంత బావుణ్ణు అనుకున్నవాడిని ఇప్పుడేమో ఈ జీవితం శాశ్వతం అయితే ఎంత బాగుంటుందని ఆనుకుంటున్నాను నన్ను మ్రింగేయాలని నాలో ఉండి ఎదురుచూసిన చీకటి నాలోని వెలుగులో అంతరిస్తుంటే ఎంత హాయిగా ఉంది జీవితం శాపం కాదు అదొక వరం అని అర్ధమయ్యకా నా లోంచి నేను అగ్నిలా ప్రజ్వరిల్లుతుంటే లోకం వింతగా నా వైపే చూస్తుంటే నాలో ఎంత గర్వం! 22May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RWNmBS

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి