పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Prasad Atluri కవిత

ప్రసాద్ అట్లూరి.. || తరగని దూరం || పెద్దచెఱువు గట్టున చింతచెట్టుపై చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడుతుంటే దొంగ పెట్టాల్సొస్తుందన్న అక్కసుతో చెయ్యితగిల్నా తగల్లేదన్న చిన్నఅబద్దం ముప్పైఏళ్ళయినా దగ్గరకాలేని దూరాలకు మనిద్దరినీ విసరబోతోందని ఆక్షణం తెలిసుంటే ఒకరికోసం ఇంకొకరు మళ్ళీ దొంగమయ్యేవాళ్ళమేమో !! అయినా ..ఎన్నిసార్లు ప్రయత్నించలేదు మనం ఒకరికొకరం దగ్గరవ్వాలని ఆ తరువాత ... గోలీలాటలో నాకోసం నువ్వు ఓడిపోతూ గోడుంబిళ్ళ క్యాచ్ నీకోసం నేనొదిలేస్తూ పంటలేయడానికి చేతులు పట్టుకున్నప్పుడు అవకాశాన్ని వదలకుండా ఎంతసేపు వుండిపోలేదలా ... కానీ ఎందుకనో.. ఓ సన్నని తెర మనల్నివేరుచేస్తుండేది !! బ్రుతుకు బాటలు మనల్ని చెరోవైపుకు చేర్చాక మాటలు రాని పెళ్లి సుభలేఖల్ని మాత్రం ఒకరికొకరం పోస్టుచేసుకుని మురిసిపోయామే .. చొరవతీసుకుని ఎవ్వరమైనా ఒక్క ఫోన్ చేసుంటే దూరమైన పలకరింపు.. దగ్గరై ఆశ్వీరదించకుండేదా పారేసుకున్న మధుర క్షణాల్ని కానుకివ్వకుండా ఉండేదా ? మరెందుకో అలాజరగలేదు ... అప్పుడు కూడా!!!! యంత్రాల మధ్య యాంత్రికమైపోయిన జీవితంలో తలపైకెత్తి చుక్కల్ని చూసే వీలుచిక్కినప్పుడల్లా నువ్వెక్కడో తలుక్కున మెరుస్తూనే ఉంటావ్ నేస్తం ఆరుబయట ఆటల్లో పిల్లలు గొడవపడుతుంటే దగ్గరకుపిలిచి సర్దిచెబుతున్నప్పుడల్లా ఎవరో కుర్రాడు బుంగమూతి పెట్టుకుని రుసరుసలాడుతూ వెళుతుంటే నిన్నునేనో నన్నునువ్వో వదిలేసి వెలుతున్నట్లేవుంటుంది దోస్త్ !! చిన్నతప్పుకు మనం అనుభవిస్తున్న ఇంత పెద్దశిక్ష ఏ న్యాయస్థానమూ ఖరారు చేసింది కాదుగా... మరెందుకింకా అహం జైళ్ళలోనే మగ్గిపోవటం!!! ప్రక్కవాడికి చెయ్యితగిలితేనే పదిసార్లు సారీ చెప్తామే ప్రాణస్నేహితుడికి చెయ్యందించి చేరువ కాలేమా వస్తున్నానేస్తం .. వదిలిన చోటుకే మళ్ళీ తరగని దూరాన్ని .. దగ్గర చేసుకుందామని !! )-బాణం-> 22MAY14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TxfQU8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి