పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Thilak Bommaraju కవిత

తిలక్/­పాత ఇల్లు ::::::::::::::::::: పగుళ్ళ గోడపై దిద్దిన అక్షరాలు దుమ్ముపట్టి చిన్నప్పుడెప్పుడో నువ్వు దిద్దినవి ఎవ్వరికీ అర్థం కాకుండా నీకు మాత్రమే తెలిసింది భుజం మీద అంగుళం చిరుగు ఖాళి సాలీడు గూటిలా సగం కొరికిన పలక ఒకపక్కగా ఎన్నిసార్లు చెరిపావో ఉమ్మితో రాళ్ళ గుల్లేరు నేలపై ఇంకిన గువ్వపిట్టల రక్తం విరిగిన బలపం కొత్త భావ చిత్రాలు నా నుండి గాలి పటాల వర్ణననలు రంగు దారాల మధ్య ఇప్పుదు అదే గోడ మీద సున్నపు పూతలు వాటి వెనకాల చెరగని అక్షరాలు ఇంకా నిన్ను కప్పేస్తూ ఆ ఇంట్లో తిలక్ బొమ్మరాజు 07.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnuqWo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి