పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Ramakrishna Kalvakunta కవిత

@డా. కలువకుంట రామకృష్ణ నా నేస్తమా నా నేస్తమా ! గుండె కొలనులో పద్మమై పరిమళిస్తూ , నా కళ్ల వాకిలిలో రంగవల్లికవై మురిపిస్తూ నీ మౌన యానంలో అనంతంగా అంతరంగంలో సంభాషిస్తూ అందినట్లే అంది , అందకుండా నా ఎదచిటారు కొమ్మన నిలుస్తూ ... నువ్వొక ప్రశ్నార్ధకమై, నన్ను ఆశ్చర్య పరుస్తూ .. నీ కోసం ప్రతీ క్షణం.... ప్రతీక్షణం ....,నిరీక్షణమ్ ఒంటరి చీకటిలో రంపపుకోతకు తల్లడిల్లే గుండెకు విరహరాగ రాత్రిళ్ళ వెన్నెలల్ని కన్నీటి జలపాతాలుగా మలుస్తూ ... ఎన్నాళ్ళీ అజ్నాతవాసాలు !కన్నీళ్ళ పూలు కలల్లో రాల్చిన గుర్తుల్ని, ప్రణయ పాశ సందేశాల్ని ఏ మేఘమూ మోసుకు రావట్లేదు ..... నా పొగజూరిన గుండె గూట్లో ఆరని స్నేహ దీపం వెలిగించి , నన్ను హఠాత్తుగా చీకటి పంజరంలో బంధించావు ! నా ఆలాపన ,నీ దాకా చేరలేదా చెలీ ! ఏటి కెరటమై ఎదను తడిపి ,నవ్వుల పూలపంటలు పండించి, నీ మాటల పరిమళాలు జారిపోతున్నై మెలకువలో నీ తలపులే ..కలలో నీ కలవరింతలే ... చిన్న చినుకే కదా !అనుకున్నా .. పెద్ద ము సురై ముంచెత్తుతుంది చిన్న దీపమే అనుకున్నా పెద్ద అగ్నిపర్వతమై నిప్పులు కురుస్తున్నది చిన్న గాయమే అనుకున్నా .. అంతులేని వేదనై గుండెను చీలుస్తున్నది కారుణ్యంలేని కాలం కట్టడితో కళ్ళనీ కాళ్ళనీ కట్టేసింది .... ఈ తడారిన గుండె ఎడారికి ,కాలం గాలమేసింది దూరం చేసే కుట్ర పన్నింది ,తెలియకుండానే మరింత దగ్గర చేసింది .. అంత కంటే ఏమి చేయగలదు .. @డా. కలువకుంట రామకృష్ణ

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ihrwyT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి