పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

- మాడగాని మధు || తేడాలు మనకొద్దురా!|| Posted on: Sun 06 Apr 21:53:42.269025 2014 రాష్ట్రాలు రెండైనా రాజధానులేరైనా రాజ్య స్వభావం మారదురా మన పోరాటం తప్పదురా! తెగులుభాష ఒకటేరా తేడాలు మనకొద్దురా! వర్గాలు ఉన్నంతకాలం దోపిడీ పాలన సాగినంతకాలం అణగారిన వారికి జరగదు న్యాయం ఎండమావిలా శ్రమజీవుల స్వప్నం.. దళితుడే తొలి ముఖ్యమంత్రియని దళితజాతిని నమ్మించి ఆ ఊసే ఎత్తని వంచకుడని ఊరువాడల చాటింపెరు.... నేతల మాటలలో నీతెంతో కనులార చూశాము మన బతుకులు ఈతీరుగుండుటకు ఈ పాలకులే కారణం... అయ్యిందేదో అయిపోయింది తెలుగుగడ్డ రెండైపోయింది శషభిషలు లేకుండా తలోదారి కాకుండా సహృదయంతో ఉందాము సహకరించుకుందాము తెలుగుతల్లి ఒడిలో ప్రగతిదారుల పోదాము! http://ift.tt/1ht7CzY?

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fTwuVD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి