పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Rambabu Challa కవిత

చల్లా గౙల్-4/ dated 07-4-2014 కరుణ కిరణం సోకగానే మంచులాగా కరిగిపో జ్ఞాన దీపం వెలగగానే వత్తిలాగా తరిగిపో పరిధిలేని సిరులు ఉన్నా ప్రాకులాట దేనికోయ్ జీవితం పరిపూర్ణమైతే కంకిలాగా ఒరిగిపో పరుల సీమన మట్టిగడ్డగ మురిసిపోతావెందుకు ఉన్న స్థానం నిలుపుకుంటూ మేరువంతగా పెరిగిపో కొనలోన బండ రాయిగ మేలు చేయని బ్రతుకు వ్యర్ధం భక్తులెందరో తొక్కిన గుడిమెట్టు లాగా అరిగిపో పరులకోసం పాటుపడని మాటలెందుకు "చల్లా" వెన్న మీగడ పెరుగు నిచ్చే పాలలాగా మరిగిపో

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mUJxr4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి