పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Krishna Mani కవిత

బాటసారి ********* గమ్యం తెలియని బాటసారిని ప్రశ్నలు గుప్పిస్తుంది నడక ఆగక దారులు కనిపిస్తున్నాయి ఎటెల్లాలో ? కళ్ళు చిట్లించుకొని చూస్తున్నాయి అలసిన దేహం వైపు ఇంకెంతగా చూడాలని ఎలుకల గోలకు మసలుతుంది కడుపు ఎంతకాలం ఈ పాట్లని గడచిన దారిలో ఎండమావులే ఎక్కిరించగా నడిచే బాటలో పువ్వులు ముడిచి ముళ్ళే పొడిచెను ! తడబడు అడుగుల గజిబిజి మనసున మాసిన మొఖమున సాగని బతుకున ఆగని గుండెను ఆపే పోరులో గెలుతును నేనని చేసిన బాసలో ఓడిన తనమున ముడిచితి తనువును ! పోవుట తప్పక నేర్చిన నడకన రేపటి సంతకు కాగడ వెలుతురు కానా కొనకు ! కృష్ణ మణి I 07-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PPfeXw

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి