పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

ఆమెకు నాకు మద్య ఆంతర్యం నేను ఆగిపోయిన అర్దరాత్రిని కాలిపోయే చితి మంటను.... నీవు సంద్యాకాశంలో చంద్రరేఖవు సిగ్గు పొదలలో పొదగబడిన పూరేకువు.. నేను స్మశాన వాటికను నీవు మల్లెల పూతోటవు.. నేను ఆకాశాల అరుణిమను నీవు శరత్కాల పూర్ణిమవు.. నేను అగ్ని శిఖరాల అరుపును నీవి మేఘమాలికల మెరుపువు.. నేను ముల్లును నీవు మల్లెవు.. నీవు గులాబివి నేను ఆ గులాబి కొనలేని గరీబుని..... ఉమిత్ కిరణ్ ముదిగొండ

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQaMmy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి