పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Chi Chi కవిత

_ లేదెదురు_ టి.వి. offలో పెట్టి చూస్తుంటే స్పురణకొచ్చిందింకోసారి నాకూ నాకూ మధ్యున్న అడ్డమేదో!! ఏదైనా ఆలోచన మెదలటానికి అనంత ప్రస్తుతమంతా కూర్చిన ఆంక్షలన్నీ దాటి నిద్రిస్తున్న స్వేచ్చా చలనాన్నిమేల్కొలిపే కార్యకారణ మూలం నియంత్రణ కోల్పోయుంది.. మూల నియంత్రణే చలన నియంత్రణ కన్నార్పే కార్యమైనా సరే దాని సన్నల్లోనే!! ఏ ఛానల్ కావాలని కాదు అసలు on ఎందుకు చెయ్యాలనుకున్న తక్షణమే స్థిరమైన యాదృచ్చికంలో ఆలోచన ఆగిపోయింది.. నియంత్రణను కూడా నియంత్రించే ఆ శక్తేదో ఆలోచన కాదు , మూలం కాదు , వ్యక్తిత్వం కాదు మరణం కాదు , నిరాశ కాదు , స్పృహ కాదు!! స్థిర చలనాలకు , కార్య కారణాలకు అతీతమైన భావన నామ రూప పదార్థ మౌనాలకావల లేదు ఉందక్కడ!! ఆ లేదుకి ఉన్నదేదీ అంటక ఎదురేదీ లేక లేదు లేనిదేదీ లేక లేదై ఉన్న స్థితిలో నియంత్రణ లేకనే నియంత్రించబడి టి.వి. on చేయకుండానే చూస్తుండిపోయా నాకూ నాకూ మధ్యున్న లేదే అడ్డంగా!!_____(14/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK41jF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి