పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Bhaskar Kondreddy కవిత

kb ||ద్వైతాద్వైతం|| ఒక దుఃఖానికి సంబంధించిన మాట నేను నీలా వుండటం. నీలా వుండాలనుకోవడంలో తప్పేమీ లేదేమో కాని, నేనే నీలా మారిపోవడం ఒక విషాదం నా జీవితం తాలూకూ చారిత్రికవిషాదం. నువ్వు పలుకుతుంటావ్ నాలో నువ్వు నవ్వుతుంటావ్ నాలో నువ్వే, నువ్వే ప్రతిక్షణం నేనై రగిలే క్షణంలో అది నా తాలూకూ మరణభావన. సాదృశ్యతలు సామాన్యమేనైనా నేనే అదృశ్యమైపోయాక, ఇక వేటిని వెతుక్కోవాలి నేను నాలో, నిరంతరం నిన్ను తప్ప. చేతులారా, నిన్ను నాటుకున్న పాపానికి నా దేహం ఇప్పడిక నా పాలిటి సమాధి. జీవమై నువ్వే ప్రవహించుకో ఇక. పాలించుకో ఇక, ఈ నీ రాజ్యాన్ని. -------------------------------------14/4/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hF2m2o

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి