పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Rambabu Challa కవిత

చల్లా గౙల్-6/ Dt. 14-4-2014 ఉగ్రవాదం మత్తులో తెగ ఊగుతున్నావెందుకు పగతొరగిలే మంటలో చలి కాగుతున్నావెందుకు లోకమంతా క్రాంతి వృక్షం పెంచుకుంటుంటే కొమ్మ తొడిగే శాంతి చివురులు తుంచుతున్నావెందుకు కూటి కోసం కూలిచేసే సాటి మనిషి గుండెలో కర్కశంగా వాడి బాకులు దించుతున్నావెందుకు సమత తీవెకు మమత పూసే పూలతోటల్లో తీవ్రవాదం కలుపు మొక్కలు పెంచుతున్నావెందుకు సర్వమతములు విశ్వశాంతిని ప్రభోదిస్తుంటే శాంతి కొరకే ఆయుధాలని పలుకుతున్నావెందుకు హితం కోసం మతం ఉందని "చల్లా" కవితలు రాసినా మతం గుండుతో మనిషి గుండెను పేల్చుతున్నావెందుకు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gvsmrA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి