పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Ramaswamy Nagaraju కవిత

...// చరమ సంధ్యలో ఒంటరి చంద్రుడు //... నింగీ నీరూ కలిసిన దిగ్రేఖ మీద తేలుతున్నది ఓ ఒంటరి ఓడ అలసిన సీగల్ లా . చిక్కిశల్య మైన శశిరేఖను పొడుచుకు తింటున్నది నిశి. నీలజలధి నీటి రెప్పల కింద కరుగుతున్నది అలల కల. తడి ఊర్పులను మోసుకొస్తున్నది నీరసించిన సముద్ర పవనం. విరుగుతున్న కెరటం ! చతికిల పడ్డ చంద్రుడు! సద్దుమణగుతున్న సాగర తీరం లో ఏదో నిరాసక్త నిశ్శబ్ద సంగీతం! అతనో నిర్లిప్త నీరవ గీతం!

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gs5NUO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి