పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Radha Rao కవిత

ఉమ్మడి కుటుంబ వ్వస్త చిన్నాభిన్నమయింది. వ్యక్తి గతస్వార్థం వెర్రి తలలు వేస్తోంది. అభిమానాలు, ఆప్యాయంగా పలకరింపులే కరువైనాయి. సమస్య ఏదైనా వస్తే ఎవరితో పంచుకోవాలో తెలియని ఒంటరి తనం. అందరూ ఉండీ ఎవరూ లేనట్లే ? సమస్య ఎవరితో పంచుకుందామన్నా అవమానాలపాలే ! ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సమస్య లే కాదు, సంతోషాలూ ఆనందాన్ని అనుభూతిని పొందేవారు. అమ్మ,అమ్మమ్మ, నానమ్మలు పిల్లలందరిందరికీ ముద్దలు కలిపి చేతినిడా పెడుతుంటే కడుపు నిండా తినేవాళ్ళం. ఎంగిలి, గోరుముద్దలు మామూలే !! నేటి పరిస్థితి ఎవరితో ఏసమస్య చెప్పుకోలేక గుళ్ళు, గోపురాలు తిరిగి చెప్పు కోవాల్సి వస్తుంది . ఏకాకి జీవితాలే నేడున్నవి !!!

by Radha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p3MFpg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి