పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Satya NeelaHamsa కవిత

"ఇయ్యాల లేడు సారు" (Prof. Jaya Shankar sir. ) ^^^^^^^^^^^ --సత్య చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! నిదానంగ తెలంగాణ అవసరాన్ని జెప్పినోడు నినాదంగ ఆక్రందన గొంతులని మల్చినోడు అలోచనలన్నింటిని ఆచరణలో జూపినోడు అలుపెరుగని పోరాటమే ఉద్యమంగ జేసినోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! దిక్కుతోచని మాకు దిక్సూచై నిల్చెటోడు ఆటుపోటులన్నీ దాటి అవతలి దిక్కు జేర్చేటోడు ముంచెత్తే అలల నుండి నిజమయ్యే కలల దిక్కు మా నావకు చుక్కానిగ ముందు ఉండి, నడిపెతోడు చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! ఉలిదెబ్బలతోనే రాయి రూపుదిద్దుకుంటది రాపిడితోనే ఇనుముకి జంగు తొలగి పోతది మరి దారిజూపేటోడివి ఇట్ల జెప్పకుండబోతే గుబులు తోని ఈ గుండె ఎట్ల కోలుకుంటది? చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! తెలంగాణకి పెద్దకొడుకువి నీకెమిచ్చుకునేది నా బిడ్డవై పుడుదువుగాని రావో నా పెద్దసారు! అల్లంత దూరాన సూడు తెలంగాణోస్తున్నది సాకారమైతే సూద్దువు గాని రావో నా పెద్దసారు!! చుక్కానిలెక్క ఎంటుండీ, తోడుగొస్తనన్నడు ఇయ్యాల లేడు సారు, చుక్కల్ల బోయిండు ! --సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NfVH17

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి