పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అవలోకనం// 1. ఒక్కోసారి చెబుతూనే ఉంటారు అపత్రహరితం గానో అబద్రతాభావం లోనో నేను కొట్టుమిట్టాడుతాను తేట తెల్ల ముఖం తెలిసిపోయి తరువాత మాత్లాడుదాం అని ముగుసుపోతుంది. 2. ఇంకోసారి నువ్వేదో చెబుతావు నేనింకేదో మాట్లాడుతాను ఐనప్పటికీ మూడో పాయేదో చేజిక్కుంచుకొని జడ అల్లుకుపోతాం. 3. అప్పుడప్పుడూ చెప్పండి అనగానే మీకు తెలియందా అంటాను విషయం వివరించక్కరలేకుండానే సరే అలాగే చెద్దామని బదులు చిత్రంగా కలుస్తాను అని ముగింపు. 4. కొన్నిసార్లు నువ్వూ నేనూ ఏదురవుతాం విచిత్రంగా మన మధ్య మాటలే ఉండవు పలకరింపుకి వీడ్కోలుకీ ఒకే చిరునామా చిరునవ్వు. 5. చివరగా ముభావాలూ ముక్తాయింపులూ ముడులు విప్పుకొంటాయి కొన్ని తెలిసి కనుమరుగైనట్టే మరికొన్ని తెలియకుండా అంటిపెట్టుకొంటాయి. విలోమ సిద్దాంతాలెన్ని ఎదురైనా ఏ లెక్కకైనా శేషం సున్నా రావాల్సిందే...20.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3nk89

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి