పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Krishna Mani కవిత

గురుగులాలయం ****************** అమ్మానాయిన కష్టం తిండికే సరిపోక పొతే నడవని పయ్యల బతుకు బండిల మా సదువులెట్ల సాగుతయీ ! అందుకే మావొళ్ళు సర్కారాస్టల్ల ఎశిన్రు నన్ను ! కడుపునిండ అన్నం ఎసుకోనికే బట్టలు సదవనీకే పొస్కాలు పండనీకే దుప్పటి ఆడుకోనికే అన్నీ అన్నీ ఉన్నా అమ్మ లేదు ! మా ఇంటికాడ సోపతోంతో జగడమాడితే తల్లి పెట్టోలె మా అవ్వ ఉరుముతుండె ఏడిస్తే దెగ్గరికిదీషి అదుముతుండె ఈడనేమో మూలిగిన గాని ముట్టరాయే ! గిన్నెవట్టి గోలుసుగడితే అన్నముంటది లేకుంటె అయ్యల్ల కడుపు కాల్తది అమ్మ ఐతే పూట పూటకు తింటలేనని తిడుతుండె అన్నకాడికి లేదనక నింపుతుండె ! మా నాయిన వారమైతె అక్కడిక్కడ ఓయి పట్టుకొస్తుండే చెర్ల శాపలేమీ ఎండ్రికిచ్చలేమీ శేనుకాఏమీ తాటిమున్జలేమీ ఇప్పుడేమో కోడిగుడ్డు కూడ ఉడకదాయే ! గిన్నెకడిగి బట్టలుతికి పెయ్యితోమి ఉరుకుల పరుగుల ఇస్కోలాయే మనసుకారి చెప్పుకుందమంటే తోడబుట్టినోల్లు కారాయే అమ్మనాయిన తోడుకులేరాయే యాదికొచ్చి నాలుగురోజులకే పానమింతాయే ! కృష్ణ మణి I 21-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l400LA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి