పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Sai Padma కవిత

అకవిత్వం-7- వాటాలు పోనాయి, మరేటి సేత్తాం .. మళ్ళీ కౌకిలే ! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఇయ్యాల మనేదిగుంది .. అది గుబులో ఎటో తెల్నేదు గానీ.. సివరాఖరికి తెలిసీసి పడేసినారు. వోరి వోరి ఎదవకానల్లారా , ఇది మీది కాదెసెహ్ , అవల్రయిట్గా వోప్పగించీసి ఎలిపోచ్చీయండి అని.. సర్లేవో, ఇయ్యాల అమిరికాలూ, ఏరే దేశాలూ అట్టుకుపోయే మడుసులకి వూరేటేహే .. అని మీరడగచ్చు ..నిజమే గానీ.. పోరా పోరా అంటే సూరట్టుకు నిలబడిపోనానికి మావు తినేదీ వోన్నమే గదా .. అదిగదిగేప్పుడో, రంగం ఎలిపోయీవారు, మా భీమిలి, ఇజీనారం, సికాకులం పిల్లలు... ఉన్దీవారో అక్కడే సచ్చేవారో తెలీకపోనాది,పెల్లాలూ, తల్లులూ కంటికీ మింటికీ లేనట్టు ఎద్సీసీ వారు ఆళ్ళ పేరెత్తితే, వద్దులేవో, అంత దూరం ఎల్లిపోయి కట్టపడిపోవాల్నా, ఉన్నూరు వదిలేసి, ఇదిగిదిగో మన ఐద్రాబాదు, రాండి, ఆ కట్టమేదో ఇక్కడే పడదాం అంటే వచ్చిన పిలగాల్లకు , మల్లీ ఎటో ఒక్కాసి పోయి గుక్కెడు గంజి తాగడం ఎంతసెపెహ్ .. మరాల్లకి బెంజి తెలీదు గదా ..!! సుకపడిపోనారు , నిండు పార్లమెంట్ లో గుడ్ద్దలూడదీసినట్టు సిగ్గుపడనేక..!! హమ్మియ్య.. ఇన్నాల్లకన్నా ,సుకంలో కాపు గాసి, కట్టంలో మర్యాద లేని పెల్లి పెటాకులయిపోనాది. సుబ్రంగా తలారా నీళ్ళోసి, పనిలోకి దిగండేహే.. ఇంకెన్ని బుజ్జి బెంగలూరులు, చేన్నపట్నాలు, మన చిన్ని చిన్ని వూల్లల్లో తయారు చేయాలి గందా.. వింటున్నారా అండీ.. ఆయ్ .. నేనేనండీ చెప్త.. పక్కవాడి ఇల్లు దుమ్ము దులిపి కల్లాపెసేందుకు ఉన్న శక్తి, మనిల్లు కడుక్కొని కళ కళ లాడించేన్దుకు డబల్ గా వస్తాది కదండీ.. సందేహం ఎందుకు .. ?? ఓయ్.. అమిరికా,ఇతర దేశాల సీమాంధ్ర బాబులూ.. మనిల్లు శుభ్రం చేద్దాం రండి . కాలికి దూరం కావచ్చు మీరు, కంటికి చాలా దగ్గరే కదా .. రండి, రండి మీ ఇంటి దుమ్మూ ధూళీ దులిపి, అయినవాల్లతో ఆనందంగా అభివృద్ది పాలు పొంగించండి.. శుభమస్తు !! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d8oET1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి