పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kanneganti Venkatiah కవిత

తెలుగు పౌరుషం రగిలించు... బిడ్డలారా! నేను అమ్మభాష తెలుగును కడుపారా పాలిచ్చి కోటి ఆశలతో పెంచుకున్నాను మీ మాటల మాధురిలో మురిసిపోయాను మౌఖిక గేయాల ఆలాపనలో పులకించాను కవిత్రయ భారతకథతో కావ్యజగత్తులో కాలుమోపి శివకవుల కావ్య విబూదిలో స్నానమాడి శ్రీనాధ చాటువుల రస సీమలో విహరించాను పోతన భాగవత భక్తిపారవశ్యంలో వేణుగానం చేసి రాయల అష్టదిగ్గజాల ప్రబంధపారిజాతాల్ని ఆఘ్రూణించి వేమన్న ఆటవెలదులతో ఆటాడుకున్నాను చిన్నయసూరి కందుకూరి పంచతంత్రకథాజ్ఞానమై గురజాడ అడుగుజాడలో దేశభక్తిని నింపాను విశ్వనాధ సి.నా.రె భరధ్వాజల చేయూతతో జ్ఞానపీఠమెక్కి జాషువా కలం బలంతో నవయుగకవిచక్రవర్తినయ్యాను కృష్ణశాస్త్రి కరుణశ్రీల గానవిలాపానికి కరిగి శ్రీశ్రీ మహాప్రస్తాన రథచక్రాలతో భూకంపం పుట్టించాను బండెనక బండికట్టి నిజామోడికి గోరికట్టి విప్లవ, అభ్యుదయ,దళిత,మైనారిటి,స్త్రీవాదాల శంఖమెత్తాను ఇది ఒకప్పటిచరిత్ర కాకూడదు ఇప్పటికైనా మేల్కొండి ! కన్నవారిని వృద్ధాశ్రమాల్లో పడేసినట్లు పరభాషావ్యామోహంలో నన్ను మూలన పడేయకండి బడులలో ,కార్యాలయాలలో నిరాదరిస్తూ మాతృభాషా ద్రోహానికి ఒడికట్టకండి . తల్లిమరణిస్తే బిడ్డలు అనాథలవుతారేమో కాని ! తెలుగు భాష మరణిస్తే తెలుగువారూ మరణిస్తారు . ఈ సత్యాన్ని గ్రహించండి..!తెలుగు పౌరుషాన్ని రగిలించండి..! {మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు}..21.2.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0oNaR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి