పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Pratapreddy Kasula కవిత

ఆమె, నేను, ఒక ఆటో - కాసుల ప్రతాపరెడ్డి ఎట్లా చెప్పేది నిందల్లో నా శీలాన్ని చెరిచినప్పుడు దేహంతో దేహాన్ని ఛిద్రం చేసినా బాగుండు అనుమానించకుండా మనిషిని నమ్మలేవు నీ అవసరాల కోసమో నీ రాతకోతల కోసమో ఆటోలో నీ పక్కన ఒదిగొదిగి ప్రయాణించాను కదా. బిడియం కాకపోవచ్చు నువ్వు తప్పులెంచకూడదనే కావచ్చు నీకు గుర్తుందో లేదో నాకైతే గుండెలో కెలుకుతున్నట్లే ఉంది కొంగైనా తాకలేదని నొచ్చుకోవాలా.. నలబై ఏళ్ల పడిలోనూ ముగ్గురు తల్లుల పసిపోరన్ని నేను ముద్దులు, ఆలింగనాలు, దేహస్పర్శలు గుండె నుంచి గుండెకు తాకాలి కదా... నాదంతా మూగప్రేమ ఇద్దరినో ముగ్గురినో ప్రేమించే ఉంటాను చెప్పలేక, దాచుకోలేక రాత్రుళ్లను నిద్రలేమితో వెలిగించినవాణ్నే వాళ్లకంతా నేను మొద్దు రాచిప్పనే కావచ్చు. తల్లీ... నా పెదవులపై గుండెతో పెట్టే ముద్దోటి చాలు హృదయం లేని దేహరాపిళ్లు వద్దు ఎంత చెప్పినా వినవు నీ పంతమేదో నీది నీ వాదనకు ఒకటే కొమ్ము నేను మనసుతో మాట్లాడుతా నువ్వు మనసుతో చూడవు కళ్ల కిటికీలు తెరవవు నువ్వు ఊహల సీసాలో బందీవి నేనేం చేయను... పదేళ్ల స్నేహమో, పరిచయమో నోరు జారానా, మాట తూలానా... జానే కహాఁ.. గయే ఓ దిన్ హసా హసా కే...

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1taOL5n

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి