పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి జబ్బు నాకు నిజంగా సందేహం కలిగింది వాళ్ళని చూస్తుంటే జబ్బు చేసింది నాకా లేక వాళ్లకా అని చికిత్స అవసరం నాకా వాళ్లకా అని జబ్బు ఉన్న నేనేమో జీవిస్తున్నాను జబ్బు ఉన్నా లేనట్టు వాళ్ళు నటిస్తున్నారు ఆ జబ్బే సుఖమనుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళ మీద నాకు చాలా జాలి వేసింది వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళని రక్షించాలనిపించింది కానీ ఏం చేయను వాళ్ళేమో గోప్పోళ్లు నేనేమో పేదోడ్ని వాళ్ళు నన్ను తమ చూపులతోనే నన్ను గెంటేస్తుంటే తమ నవ్వులతోనే నన్ను చంపేస్తుంటే ఇక నా ఉనికి వాళ్ళకి అంటనంత దూరంగా వెళ్ళి పోయాను నేనిక్కడ సజీవుడ్ని వాళ్ళ సంగతేమో నాకు తెలియదు! 19May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lFO1R8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి