పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ// ఎప్పట్నుంచో... మనం ఒకలాగే ఉండిఉంటాం నమ్మకం లేని తనాన్ని నమ్మలేదనుకుంటూ.. ఇవాళ అనుమానమొచ్చిందంతే... నన్ను అతనుగా అనుకొని ఉండడు నాలానే ఉన్న నువ్వూ బహుశా.. అద్దానికెదురుగా నిలుచునొని ఉండవు నెనూ అతన్నీ, నిన్నూ నాలా చూసి ఉండను... . పాంజియా పగిలినప్పుడు శబ్దం విన్నదెవడూ..!! భళ్ళుమందా..!,ఫెటిళ్ళుమందా అనంతానంత విశ్వపు కపాల మోక్షం చితికిపోయి "చితి"కిపోయుంటుంది అచ్చంగా నాలో పేరుకున్న నమ్మకపు కుడ్యం కూలిన శబ్దంలా ఉండిఉంటుంది... వినిపించకుండిఉంటుంది వేళ కాని వేలలలో దారేలేని దారులలో క్యా.... మియా...! క్యా డూడ్రా ఇధర్...?? ఎక్కాడా వెతక్కు వెతక్కు ఇంకో మనిషికోసం శ్రీ శ్రీలూ, స్త్రీ స్త్రీలూ.. అందరూ నువ్వే.. ఇంకోలా ఎవరూ ఉండరూ కాస్త తేడాలతో అందరూ నువ్వై... బహుఏక వచనమై ఉంటావ్... లేరిచటా,అచ్చటా ఎచ్చ్చోటనూ వెరు వేరు మనుషులు అంతా నువ్వే అన్నీ నువ్వే మహోద్విగ్నతల మద్య నీ శిలా విగ్రహావిష్కరణ నాలుగు మనసుల చౌరస్తా మీద.. నువ్వేనా...! అది నేనేనా...!! అనుకున్నామో కనుగొన్నామో తెలిసేటప్పటికే భగవత్ గీత మీద చేతులు పెట్టబడ్డాయ్... "మై లార్డ్...! నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ అనబడే నేను... నన్ను నేనుగా పోల్చుకొనుటలోనూ, ఇతరులందు నా లక్షణములను గుర్తించుటలోనూ... విఫలమై నన్ను నేనే మొసగించుకున్నానను నేరారోపన నిరూపింపబడి దోషిగా తేల్చబడినాను కావున ఈ దోషి దోసిట్లో కాస్త శిక్షని వెయ్యండి" "పాప పరిహారమునకు రక్తతర్పనమనివార్యము" అని పవిత్ర గ్రంథములందున చెప్పబడియే యున్నది.. 19/05/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vsfegR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి