పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు -33 . మీరు ఇంతవరకు Jacob Barnett పేరు విని ఉండకపోతే, మీరు అతన్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఈ లింకులో (http://ift.tt/1syaFzg) TEDxteen లో అతని ప్రెజెంటేషన్ చూడవచ్చు. తారే జమీన్ పర్ చిత్రం మనకి "ఆటిజం" గురించి అవగాహన కలిగించడంలో తోడ్పడి ఉండవచ్చు గాని, అటువంటి పిల్లలని పెంచడానికి ఎంత మానసిక పరిణతి, ఆత్మస్థైర్యం, మొక్కవోని ఆశ, పెంచే వ్యక్తి (వ్యక్తుల)కి నమ్మకం ఉండాలో చెప్పనక్కరలేదు. జీవితంలో నిజమైన సవాలు అదే. గెలుపుకి అతి తక్కువ అవకాశం ఉన్న చోట, 2 సంవత్సరాల వయసులో ఇక Jacob జీవితాంతం మాటాడలేడు అని వైద్యులు ఆమె ఆశలపై నీళ్ళు జల్లితే, వాళ్ళ సలహాని పక్కనబెట్టి అతని తల్లి Kristine Barnett … ఇప్పుడు Einstein అంతటివాడుగా ప్రపంచంలోని మేధావి వర్గాలు Jacob ని గుర్తించేలా పాటుపడింది. అతను ఖగోళశాస్త్రానికి సంబంధించి సంక్లిష్టమైన సమస్యలకి సమాధానం కనుక్కుందికి ప్రయత్నిస్తున్నాడు. అయితే దీనికీ కవిత్వానికీ ఏమిటి సంబంధం? అన్న ప్రశ్న మీకు రావచ్చు. మీకు ఇచ్చిన పై లింకులో అతనో మాట అన్నాడు. మీరు కాలేజీలో చదివేవన్నీ మరిచిపొండి ... అని. శలవుల్లో మీకు ఏది ఇష్టం అయితే దాన్ని ముందుకి తీసుకుపొండి. మీకు ఏది ఇష్టమైనదో మీరే నిర్ణయించుకోవాలి అని కూడా అన్నాడు. మనకి చదువు అంటే వివేచనాత్మక పరిజ్ఞానం కాదు, కేవలం ఎవరో చెప్పినది యధాతథంగా, ఏ సంశయాలూ లేకుండా (implicit గా) అంగీకరించి బట్టీయం వెయ్యడమే. ఇప్పుడు చెప్పబోయే కవితలోని తాత్పర్యంకూడా సరిగ్గా అదే. అందుకు ఈ ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. బాల్యంలో ఉండే అద్భుతమైన "Creativity" ని బయటకి తీసుకురావడంలో మన విద్యావిధానం విఫలమౌతోంది. కేవలం వినియోగదారులు తయారవుతున్నారుతప్ప, ఉత్పత్తిదారులు తయారవడం లేదు. మనిషిచేసే అన్ని investments లోనూ అతి పెద్ద risky investment చదువుపై కాలాన్ని మదుపు పెట్టడం. యవ్వనంలో ఉన్న మనిషికి ఒక్కొసారి ఈ సందేహం కలుగుతుంటుంది... నా చదువు ఎందుకైనా పనికివస్తుందా? … అని. జీవితంలో కొంత పరిణతి సాధించినతర్వాత, మనకున్న అపోహలు ఒక్కటొకటిగా కరుగుతున్నప్పుడు చదువు ఏ మేరకి జీవితంలో పనికివస్తుందో / లేదా పనికిరాదో తెలుసుకుంటున్నప్పుడు, అనుభవానికి ఉన్న ప్రాధాన్యత అర్థమై, కొన్ని విశ్వాసాలను "unlearn" చెయ్యవలసిన ఆవశ్యకత అర్థమౌతుంది. అందరి జీవితానుభవాలూ ఒక్కలా ఉండవు కాబట్టి ఎవరికి వారు unlearn చేసే విషయాలు మారుతుంటాయి. ఈ క్రమంలో, మన అభీష్టాలకి వ్యతిరేకంగా జరిగే కొన్ని సమకాలీన మార్పులను మన అవగాహనా రాహిత్యం వల్ల, అయిష్టతవల్ల వాటిని మార్పులుగా గుర్తించం, అంగీకరించం. దానిఫలితమే మనం అంతర్ముఖులమైపోవడం. (బహుశా, ఇక్కడ ఈ “చలి-విడిది” సన్నిహితమౌతున్న మృత్యువుకి సంకేతం కూడా కావచ్చు. ) . చలి – విడిది . చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను. నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నది మరిచిపోడానికీ ఆ తర్వాత జరిగిన విషయాలు అంగీకరించడానికి నిరాకరించడంలోనూ గడిపేను. నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు. ఇప్పుడిప్పుడే మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ ఒకటి తర్వాత ఒకటి తుడిచెయ్యగలిగితే దాని ప్రయోజనం ఉంటుంది. అప్పుడు నాకు తెలిసినవేవీ ఇక మిగలక, నా మనసు అంతర్ముఖమౌతుంది... చేలలా, మంచులా. . ఫిలిప్ లార్కిన్ (9 August 1922 – 2 December 1985) ఇంగ్లీషు కవి . The Winter Palace . Most people know more as they get older: I give all that the cold shoulder. I spent my second quarter-century Losing what I had learnt at university. And refusing to take in what had happened since. Now I know none of the names in the public prints, And am starting to give offence by forgetting faces And swearing I've never been in certain places. It will be worth it, if in the end I manage To blank out whatever it is that is doing the damage. Then there will be nothing I know. My mind will fold into itself, like fields, like snow. . Philip Larkin (9 August 1922 – 2 December 1985) English Poet and Novelist

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1syaFzh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి