పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Maheswari Ande కవిత

అమ్మా!! నా ఉనికికి కారణమైన బీజాన్ని, నీవు భారమని తలవక ప్రీతితో మోశావు!! నీ కదలికలవలన కలిగిన అసౌకర్యానికి, నీవు సంతోషించి పరవశించావు!! నేను ఈలోకానికి రావడనికి కలిగించిన బాధను, నీవు ఆనందంగా భరించి ప్రేమను పంచావు!! నే వేసిన తప్పటడుగులును సరిజేసి, అలుపెరుగని బాటసారిగా తీర్చిదిద్దావు!! సుమధురమైన నీ భాష నాకర్థంకాదేమోనని, భావరహితమైన నా పలుకులనే మట్లాడసాగావు!! నా ఙ్ఞానసముపార్జనకై, నీ సమయాన్ని వెచ్చించావు!! నా కలల సాకారానికై, నీవు నిరంతరం శ్రమించావు!! రెండక్షరాల నా పిలుపుకై ప్రతిక్షణం పరితపించావు అమ్మా!!యని నొరారా నిన్ను పిలిచి, నీకు కలిగిన ఆనందాన్ని చూసి, నేను సంతోషించడం తప్ప మరేమీ చేయలేని నా అసమర్థతను మన్నించి, నీ ప్రేమను రెట్టింపు చేస్తున్న నీకు నేనేమిచ్చి ఋణం తీర్చుకోగలను??

by Maheswari Ande



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QuGwTh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి