పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

నువ్వే నువ్వే ఎందుకు నన్ను కనలేదు ఎప్పటికీ పెరగని నీ ఎత్తుబిడ్డనై ఎల్లప్పుడు నీ ఒడి దాగివుందును కదా రోజూ నీ ముద్దులతో రోజాపూవునై వికసింతును కదా నెలపొడుపు చూసి నా ముఖం చూసి నీ వెన్నెలకళ్ళతో ఆడించేదానివి కదా నీ గారాబుపట్టినై నీ ప్రేమపొత్తిళ్ళలో దుఃఖమే ఎరుగని మొదటి మనిషినయేవాణ్ణి కదా నీ కొంగు చాటున నీ పాలగుండెలపైన ఆకలి తీరని పాపాయినై వుందును కదా నీ కుచ్చిళ్ళులాగి నా ఎత్తుకు దింపుకుని తలమీద నీచేయి కిరీటం పెట్టుకుందును కదా ఎన్నడూ కోపగించని నీ మమతలతో నీతోనే హాయిగా వుండేవాణ్ణి కదా ఎందుకు నువ్వు నన్ను నా కలగా కన్నావు ఈ ఆర్తి తగ్గని దుఃఖాలపాలు చేసావు ఎపుడూ నిన్నే వెతుక్కోమని ఇట్లా ఒంటరిని చేసి వొదిలావే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU3ZT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి