పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

"సముద్ర ఘోష" కవయిత్రి:శిలాలోలిత. ఇలాంటి కవితని ఏ మగాడూ రాయలేక పోయాడెందుకు? చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నాకిది, ఈ కవితకు ఎన్ని శీర్షికలు పెట్టొచ్చోకదూ నా జీవితం లోంచి మా అత్త గారి పేరు మీ జీవితంలోంచి ఎన్నో ఎన్నెనో పేర్లు, ఎందరు స్త్రీలు తల్లిగా చెల్లిగా ప్రియురాలిగా భార్యగా అత్తగా మామ్మలుగా తమ తమ జీవితాలని ధారబోయలేదు...చివరికి ఆ సముద్ర ఘోషలా మిగిలిపోలేదు. "ఎడారులు ఒకప్పటి సముద్రాలేమో" ఆసక్తి కలిగించే ఎత్తుగడతో మొదలై "నత్తగుల్ల ఘనీబవించిన సముద్రానికి ప్రతీక" అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. "నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం" నత్తగుల్ల వినిపించే ఆ రహస్యం ఏమిటి ఈ సమాజానికి తెలియందా కాదుకదా...సముద్రమంతటి స్త్రీలని నత్తగుల్లగా మార్చిన పాపం ఎవరిది నీది నాది మన అందరిదీ...ఎదారి నత్తగుల్ల అందులో వినిపించే సముద్రపు హోరుని కవయిత్రి కవిత సారాంశంగా చెప్పిన తీరు ఆమె పరిణితిని సుస్పష్టం చేసాయి అనటం అతిసయోక్తి ఏ మాత్రమూ కాదు. "ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం" ఈ ముగింపులో ఎంత చక్కగా చెప్పారు "కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు" అలోచింపచేసే కవిత. సందర్భం ఏదైనా స్త్రీ అడుగడునా నిత్యం అణగదొక్కబడుతూనే ఉంది, కవయిత్రి శిలాలోలిత గారి కలం ఇలా సమాజాన్ని ప్రశ్నిస్తూ మరిన్ని కవితలతో కనువిప్పు కలిగిస్తూ కవనం కొనసాగించాలని కోరుకొంటున్నాను. మన అందరం చదువుకున్నదే భూమి ఒకప్పుడు పూర్తిగా మంచుతో నిండి కాలక్రమేణా కరుగుతూ...సముద్రాలు భూమి ఇత్యాదులు ఖండాలుగా ఏర్పడుతూ వివిధ దేశాలుగా రూపాంతరం చెందింది...పోతే భారతదేశంలో స్త్రీని దేవతగా కొలవడం సర్వసాధారణం మరి ఈ కర్మ భూమిలో "గృహ హింస" చట్టం అవసరం ఎందుకొచ్చింది, సముద్రాలంటి స్త్రీలు ఎడారిలో నత్తగుల్లలా ఎందుకు మిగిలారు ఈ మాతృ దినోత్సవ సందర్బంగా ఒక సారి ఆలోచిద్దాం......మీ వర్మ కలిదిండి. "సముద్రఘోష" ఎడారులుఒకప్పటి సముద్రలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుల్ల ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం 11.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU8Ns

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి