పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Arcube Kavi కవిత

కొడుకా..యుద్దానికి నడు ______________________ఆర్క్యూబ్ కొడుకా-ఊరూరి చెరువు చెదిరిపోతుంది జెరంత గడ్డపార పట్టుకొని పోరాదు నీయవ్వ..తవ్వుకుంట కూసుంటె తెలంగాణ ఎవడు దెస్తడే ? బిడ్డా..గా హాస్టల్ల పురుగులన్నం బెడుతుండ్రట అట్లవొయ్యి అడిగిరాపో అరే ఏందే నీ లొల్లి అటువోతే ఇటువోతే తెలంగాణ ఎవడుదెస్తడే కొడుకా..గా చెట్లను మొదట్లకు కొట్టేయకురా వాటి కొమ్మలనిండా గుత్పలున్నై మీ నాయిన వాటితోనె రణంజేసిండు ముసల్దానా-నా ఇజ్జత్ దీత్తవానే అవిటితోని మనింటికి దర్వాజలు జేయిస్త మనకు పతార కావల్నా వద్దా ? ఒరే వారి ..గా పిట్టల్ని చంపకురా అవి మనింటి పొల్లగాండ్లురా థూ నీయవ్వ ..ఇగ నన్ను బజార్లవడెయ్యి ఇంటికి బొక్కాసకచ్చినోన్ని అట్టిగ పంపిత్తమా ఏంది కొడుకా ఊకే ఏంబంటవురా అట్లదిరిగితే నలుగురు ఏమనుకుంటరో తెల్తది ఎట్ల నడుసుకోవాల్నో తెల్తది అరె ఏందే నీ సణుగుడు నా లెక్కలు నాకుంటై నా వ్యూహాలు నాకుంటై నాకు సిగ్నల్ వస్తంది మంచిగ కలవడుతున్నప్పుడే లేపి కూసుండవెడ్తవు థూ నీయవ్వ ..ఎక్కడిదే నీకీ గుణం కొడుకా..రాత్రిపూట ఒక్కనివి పోతున్నవు ఎటు పోతున్నవో చెప్తలెవ్వు ఏంజేస్తున్నవో తెలుస్తలేదు అగులు బుగులైతందిరా... నీయవ్వ నా మీద నమ్మకం లేదానే ఆంద్రా పార్టీలను బొందవెడ్తనని జెప్పిన గదనే జాగ కోసం ఎతుకుతున్నా నాయినా మరి..అర్రలకెల్లి ఎల్తలెవ్వు పొద్దంత అండ్ల ఏంజేస్తున్నవురా ఏ పోవే..నీకన్ని అనుమానాలే బంగారు పళ్ళెం జెయ్యద్దా అండ్ల నీకు బువ్వ పెట్టద్దా వద్దుర కొడుకా - మట్టిల పుట్టిన మట్టిల పెరిగిన మట్టి సిప్పల్నే దింట గీ మట్టిల్నే కలుస్త నువ్వు గా వంకర వోతన్న నల్లగొండ దిక్కు పొయ్యిరాపో ఎందుకే అమ్మా..ఒక్క నాలుగు రోజులాగు ఐతే ఈ నాలుగు రోజులు మన కరీం నగర్ గుట్టల్ల కావలి వండుపో అమ్మా..ఎందుకే సూదుల్తో పొడుస్తవు ఒక్క రెండు రోజులు ఈడ లెవ్వనుకో ఐతే..ఈ రెండు రోజులు హైదరాబాదుల కబ్జా ఐన భూములల్ల సిపాయి లెక్క కలబడకుంటమాయే అట్టిగ నిలవడి రాపో ఓ అవ్వా..ఎందుకే తిన్న తిండి పెయ్యిన వట్టకుండ సతాయిస్తవు ఒక్క దినం ఓపికవట్టు ఐతే ఈ దినం చచ్చి మన ఆత్మల జీవం బోసుకున్న యాదయ్యింట్ల దీపమై ఎలిగి రాపో అవ్వ నీ పుణ్యముంటది నన్ను సంపుక తినకు నువ్వు మనవనితోని వొయ్యి నాలుగుతీర్ల తీపి వస్తువలు కొన్నుక్క రాపో ఆడ కిందిమీద జేత్తన్న తెలంగాణ వస్తంది కొడుకా..ఆడ నువ్వు కిందిమీద జేసేదేముండది ఈడ ఓయు పోరగాండ్లతోటి పొడుస్తున్న పొద్దు కోసం పపతి వట్టుపో అవ్వా..నువ్వు ఓపికగల్లదానవు ఏండ్లాగినవు పూండ్లాగినవు ఒక్క గంట గడువియ్యి పొయ్యి మనవరాలితొ బతుకమ్మలెత్తుకుంట పోటువలు దిగుపో సరె కొడుకా ఈ గంట అటేటు వొయ్యి మన కవులేమనుకుంటున్నరో విని రాపో అవ్వా..బువ్వ ఉడికేదాంకాగినవు ఉమ్మగిల్లేదాకా ఆగవా ? నువ్వట్ల ఒరుగు..నిమిషంల లేపుత చూడు కొడుకా..గడువులు వాళ్ళ వీళ్ళకు గాదురా నీకిస్తున్న ఈ ఒక్క నిమిషంల నా బొండిగ పిసికి చంపు గప్పుడు గమ్యాన్ని ముద్దాడినోనివైతవు ఏందే గట్లంటవు కొడుకనిజూడకుండ నన్నంటె నిన్నట్లు గాదే సాలుతియి.. గీ లంగ మాటలకు ఏంతక్కువలేదు ఎప్పుడువడితే అప్పుడూద అది అగ్గి బిడ్డా పరాశికాలద్దు తండ్రులు కొడుకులకు కొరివి వెడుతంటే ఉద్యమం కాటికారా పోయేది ఇంట్ల వండి చేసిన యజ్ఞాలు గివ్వేనారా ఒక గుత్ప వట్టవు ఒక్క ఆయుధాన్నైన గురి చూసి స్పందించవు తురుంఖానువు నువ్వొక్కనివే అనుకుంటనే ఈడిదాకచ్చింది గా ఎస్టేట్ల ఎలుక గొద్దెలు పాతినవారా ఊకూకే తవ్వుక సూడ ఆ పండుడేదో పొయ్యి బయ్యారం గనులల్ల వండుపో మన సాలేట్ల నడువదో నేను జూత్త నడువూ పోలవరం కింద పొలికేక వెట్టు అదో లెక్క అట్టిగ వాన్ని కలుపుకోను వీన్ని కలుపుకోను ఏమిటికిరా సభలు ? బిడ్డ నువ్వు మంచిగుంటె నాకు పేరత్తది నువ్వు తప్పులవడితే తల్లి గిదేన చెప్పింది అని తిడుతరు కొడుకా.. ఏదిట్ల పిడికిలి వట్టు ఇదే మీ అమ్మనుకో పట్టు సడలియ్యకు నా ఆట పాట తెచ్చుకుంట దునియంత ఆడుతా మొగులునంత పాడుతా.. ఇగ అను ఒకసారి గట్టిగ జై తెలంగాణా

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgkXRB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి