పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Pusyami Sagar కవిత

వలస చిత్రం ____________పుష్యమి సాగర్... ఇక్కడ కొన్ని వెలిసిన రంగులు కాన్వాసు పై చిత్రాలు గా మారతాయి పిండం ఉమ్మ నీరు లో చేప లా ఈధుతున్నప్పుడు, విత్తనాన్ని మరెక్కడో మొలకేత్తించాలని తమ కడుపులు కట్టుకొని ...ఆశల దారాల్ని అల్లుకుంటూ అహరహం శ్రమించి ఆకాశంలో పయనింప చేస్తారు రెక్కలొచ్చిన కొన్ని పక్షుల్ని ...!!!!!. తమ బతుకులు మార్చుకోవాలని తమని తాము చెక్కుకుంటూ ఇంకిపోయిన కన్నీళ్ళని కరెన్సీ కట్ట ల కింద దాచేస్తు ... చరవాణి ద్వారా గుండె చప్పుడు వినిపిస్తారు ...., చిన్నప్పటి జ్ఞాపకాలను, కొన్ని ఆనందాలను, దుఖాలను ఇంటి వాకిట పరిచి గడిచిపోతుంటాం కాలం ఒడి లో ...!!!! చదువులను మదించి ముళ్ళను పూలబాటగా మలచుకొన్న బతుకు చిత్రం....దీనికి మరో వైపు , గంపెడు పిల్లలని , ఆబగా నోరు తెరిచి చూస్తున్న అవసరాలను . .పెళ్ళికి ఎదిగిన కూతుళ్ళ చూపులను ., కట్టుకున్న ఆడది వంటికి నిండుగా కప్పలేని నిస్సహయత ని జనాల జాలిచూపులని ..తట్టుకోలేక కసిగా ... వెంటాడుతు విసిరేయబడతాయి ... అజ్ఞానపు తురుపు ముక్కలు !! ఎడారి పచ్చిక బయళ్ళలో పాస్ పోర్టులు లాక్కోబడి, ముద్ద దొరకక కడుపుచుట్టుకుపోయిన పేగులను తన్నుకుంటూ వచ్చిన ఆకలికేకలు గాల్లో కలిసిపోయి చెత్త కుప్పలో దిక్కులేని కట్టే గా విసరబడ్డప్పుడు , పాలకులు చలువ కళ్ళద్దాల లో చిత్రమే చూసారు ... ఇవి కొన్ని చరిత్ర లో లిఖించబడని కొన్ని రక్తాక్షరాలు కనిపించని చేదు నిజాలెన్నో తమని తాము కాల్చుకుంటూ ప్రతి క్షణం బూడిద గా మారుతూనే ఉంటుంది ...!!! వ్యధాభరిత జీవితాలను ఓడ్డున పడేసే దేవుడు ఎప్పుడు వస్తాడో . వేల కళ్ళలో చిగురిస్తున్న అంతులేని ప్రశ్న ...!!!!! మే 11, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyLLu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి