పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Kanneganti Venkatiah కవిత

ఏది ఏమైనా వో...కోయిలా..! కోయిలా..! నీ నోట ఆమని రాగం ఆలపించకముందే ఎన్నికల కోడి కూసింది షడ్రుచుల ఉగాది పచ్చడి అంగిట్లో రంగవల్లులు వేయక మునుపే షడ్రాజకీయ పార్టీలు నవరసాల పొత్తు చట్నీని ఆబగా జుర్రుకుంటున్నాయి పండితుల పంచాంగ శ్రవణం విందు చేయక మునుపే పంచమ శృతిలో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. కోయిలా..! నువ్వు లేత చివుళ్ళ రుచినాస్వాదించక మునుపే ఓటరన్న పచ్చని జీవితపు చిగురాశల్ని మేస్తూ కొత్త బెల్లం పానకం చవి చూడక మునుపే బెల్లపుసారాయి ,బీరు, చేరువాల ఘుమాయింపుతో మెదడుకు మత్తెక్కి తొక్కిసలాడుతున్నాడు. కోయిలా..! నీ కూత ఒక వసంత ఋతువు!! ఎన్నికల మోత! పంచ వసంతాల పరిపాలనా క్రతువు!! పచ్చని చెట్లతో రంగు రంగుల పూలతో ప్రకృతి తనువంతా పులకింత.! పచ్చ నోట్లతో రంగు రంగుల జెండాలతో ఓటర్లకు కూసింత కలవరింత.!! ఏది ఏమైనా వో ...కోయిలా...! నువ్వు "జయ"నామ వత్సరాన్ని నీ గొంతుతో స్వాగతించు మేము నవతెలంగాణా విజయోత్సవ గీతమై దిగ్దిగంతాలలో ...ధ్వనిస్తాం....ప్రతిధ్వనిస్తాం. (మీకూ మీ కుటుంబానికీ, జయ ఉగాది శుభాకాంక్షలు)

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mmcPyr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి